కదిలే కారులోకి దూసుకొచ్చిన అడవి మృగం..తల్లి ఒడిలోని చిన్నారి మృతి

Updated on: Jan 18, 2026 | 4:08 PM

మృత్యువు ఎప్పుడు, ఏ రూపంలో ముంచుకొస్తుందో ఎవరూ చెప్పలేరు అనడానికి ఈ ఘటనే ఒక ఉదాహరణ. పండగ పూట ఆనందంగా స్వగ్రామానికి వెళ్తున్న ఒక కుటుంబంలో ఊహించని విషాదం చోటుచేసుకుంది. రోడ్డుపై వెళ్తున్న కారులోకి ఒక్కసారిగా అడవి జంతువు దూసుకురావడంతో.. తన తల్లి ఒడిలో ఎంతో సురక్షితంగా ఉన్న నాలుగేళ్ల చిన్నారి ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. మధ్యప్రదేశ్‌లోని గుణ జిల్లాలో జనవరి 14న ఈ విషాదకర ఘటన చోటుచేసుకుంది.

గుణ ప్రాంతానికి చెందిన సోను జాట్‌ అనే వ్యక్తి సంక్రాంతి పండగను జరుపుకోవడానికి తన భార్య, నాలుగేళ్ల కుమార్తె తాన్యతో కలిసి బుధవారం తమ స్వగ్రామానికి కారులో బయల్దేరాడు. బైపాస్‌లోని దోఖంభా ప్రాంతానికి చేరుకోగానే రెండు నీల్‌గాయ్‌ జంతువులు అకస్మాత్తుగా రోడ్డు పైకి వచ్చాయి. ఒక్కసారిగా దూసుకొచ్చిన అడవి జంతువులను చూసి సోను అలర్టయ్యే లోపే దారుణం జరిగిపోయింది. ఆ జంతువుల్లో ఒకటి కారు అద్దం పగలగొట్టుకుని లోపలికి దూసుకొచ్చింది. దీంతో ముందు సీటులో తల్లి ఒడిలో కూర్చుని ఉన్న నాలుగేళ్ల తాన్య తలకు జంతువు కాళ్లు బలంగా తాకడంతో తీవ్ర గాయాలయ్యాయి. హాస్పిటల్‌కి తరలించగా చికిత్స పొందుతూ చిన్నారి మృతిచెందినట్లు వైద్యులు వెల్లడించారు. ఊహించని ప్రమాదం ఆ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. కారులో చిక్కుకున్న నీల్‌గాయ్‌ను బయటకు తీసి చికిత్స అందిస్తున్నట్లు అటవీ శాఖ అధికారులు తెలిపారు.

మరిన్ని వీడియోల కోసం :

సీఎంను చిప్స్‌ అడిగిన చిన్నారి..ముఖ్యమంత్రి రియాక్షన్‌ ఇదే!

అక్కడ గ్రాము బంగారం ధర రూ.200 లోపే!

నాతో ఎకసెక్కాలాడితే ఇలాగే ఉంటది మరి!

ముగ్గుల పోటీలో పాల్గొన్న మహిళలందరికీ కానుకగా పట్టుచీరలు.. ఎక్కడంటే..

కొల్లేరు చేపల పులుసు.. ఇలా వండారంటే..అస్సలు వదలరు!