వామ్మో.. ఇన్నిరోజులూ ఆ మందుబాబులు తాగింది ఇదా

Updated on: Oct 06, 2025 | 8:05 PM

మందుబాబుల గుండె పగిలే స్కామ్‌ను పోలీసులు బట్టబయలు చేశారు అన్నమయ్య జిల్లా మదనపల్లి పోలీసులు. తాగితే కిక్కు సంగతి దేవుడెరుగు.. ప్రాణాలు పోయే భయంకరమైన దందా గుట్టురట్టు చేశారు. సోదాలలో.. అచ్చం ఒరిజినల్‌ బాటిల్స్‌లాగే ఉన్న ఆ నకిలీ లిక్కర్‌ తయారీని చూసి పోలీసులే షాక్‌ అయ్యారు.  లేబుల్‌, హ్యాలోగ్రామ్‌, సీలింగ్‌ అన్నీ పక్కా ఒరిజినల్‌లాగే రెడీ చేసి.. కల్లీ మద్యం దందా నడిపిస్తున్న అక్రమార్కులను అరెస్ట్ చేశారు.

సోదాలలో భాగంగా.. ములకలచెరువు దగ్గర ఈ నకిలీ మద్యాన్ని ఎక్సైజ్‌ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నకిలీ లేబుల్స్‌, ఒరిజినల్‌ ఖాళీ బాటిల్స్‌తో కల్తీ లిక్కర్‌ తయారీ చేస్తున్నట్లు గుర్తించారు. బాటిల్ క్యాప్ నుంచి హాలోగ్రామ్ సీల్ వరకూ అంతా కాపీ కొడుతున్నట్లు తేల్చారు. బాటిల్స్‌లో స్పిరిట్‌ను నింపేసి అచ్చం బ్రాండెడ్‌ లిక్కర్‌లాగా సీలింగ్‌ చేసి జోరుగా దందా సాగిస్తున్నారు. నలుగురు ఒడిశా వాళ్లతో సహా 9 మంది నిందితులను అరెస్ట్‌ చేశారు. కోటి రూపాయల విలువ గల మధ్యాన్ని సీజ్ చేసి.. 13 మందిపై కేసు నమోదు చేశారు. వీరిలో పరారీలో ఉన్న మరో నలుగురి కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. అరెస్టయిన మొత్తం 9 మందిలో స్థానిక టిడిపి నేత కూడా ఉన్నారు.. నిందితులు ములకల చెరువు హైవేకు పక్కనే మూసేసిన ఓ దాబాను అద్దెకు తీసుకొని నకిలీ మద్యం తయారీ కేంద్రంగా మార్చి.. విక్రయాలు జరుపుతున్నారని పోలీసులు తెలిపారు. తయారుచేసిన నకిలీ మద్యాన్ని స్థానికంగా మద్యం దుకాణాలకు సరఫరా చేసి డబ్బులు దండుకున్నట్లు తమ విచారణలో వెల్లడైందని పోలీసులు వెల్లడించారు. ఎక్సైజ్, స్థానిక పోలీసుల సంయుక్త దాడిలో ఈ లిక్కర్ స్కామ్ బయటపడిందని.. పోలీసులు తెలిపారు. లిక్కర్ తయారీకి వినియోగించే మెటీరియల్, మిషనరీ సీజ్ చేశారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

సీతాఫలం తింటే చర్మం మెరుస్తుందా..!

సరిపడా నీరు తాగితే బీపీ తగ్గుతుందా ??

దూసుకొస్తున్న తోకచుక్క.. భూమికి ప్రమాదం తప్పదా

కోల్డ్‌ రిఫ్‌ను బ్యాన్‌ చేయడం హర్షణీయం

పరిమళించిన మానవత్వం.. వైరల్ అవుతోన్న వీడియో