Space death (Know this): స్పేస్‌లో మనిషి చనిపోతే ఏమవుతుంది.? సైంటిస్టులు ఇచ్చిన క్లారిటీ ఏంటి..? (వీడియో)

|

Oct 23, 2021 | 8:39 AM

యావత్‌ ప్రపంచం దేశాలు అంతరిక్షంలోకి విహారయాత్రలపై పరిశోధనలు జరుపుతున్నారు. అంతేకాదు.. మనవుడు ఇతర గ్రహాలపై నివాసం ఏర్పాటు చేసుకునేందుకు కావాల్సిన..

యావత్‌ ప్రపంచం దేశాలు అంతరిక్షంలోకి విహారయాత్రలపై పరిశోధనలు జరుపుతున్నారు. అంతేకాదు.. మనవుడు ఇతర గ్రహాలపై నివాసం ఏర్పాటు చేసుకునేందుకు కావాల్సిన.. వనరులపై కూడా ప్రయోగాలు చేస్తున్నారు. అయితే అంతరిక్షంలో జీవించడం ఎలా అన్నదానిపై మనం ఆలోచించాల్సిన పరిస్థితులు వచ్చేస్తున్నాయి. అయితే భూమిపై మరణించాక మానవ దేహం దశలవారీగా కుళ్లిపోతుంది. కానీ అదే అంతరిక్షంలో చనిపోతే ఏమవుతుందన్న ప్రశ్నకు తాజాగా సమాధానం ఇచ్చారు సైంటిస్టులు.

స్పేస్‌లో చనిపోయిన వ్యక్తి.. స్పేస్‌ సూట్‌ ధరించి ఉన్నా.. బాడీ మొత్తం బిగుసుకోనిపోతుందని తెలిపారు సైంటిస్టులు. ఆ వ్యక్తి యొక్క పేగుల్లోని బ్యాక్టీరియా.. మృత కణజాలాన్ని తినేయడమూ జరుగుతుందని తెలిపారు. ఈ బ్యాక్టీరియా పనిచేయడానికి ఆక్సిజన్‌ అవసరం. ఈ వాయువు పరిమితంగానే ఉంటే ఈ ప్రక్రియ నెమ్మదిస్తుంది. భూమిలో ఖననం చేసిన దేహాన్ని కుళ్లబెట్టే ప్రక్రియలో నేలలోని సూక్ష్మజీవులూ సాయపడతాయి. ఇతర గ్రహాల్లో అలాంటివి లేవు. అంగారకుడిపై పొడి వాతావరణం.. శరీరంలోని మృదు కణజాలాన్ని ఎండిపోయేలా చేస్తుంది. గాలివాటున వచ్చే అవక్షేపాలు.. భూమి మీద తరహాలో అస్థిపంజరాన్ని క్షీణింపచేయవచ్చు.రోదసిలో మృతదేహం పూర్తిగా కుళ్లిపోదని తెలిపారు సైంటిస్టులు. అక్కడి గురుత్వాకర్షణ, వాతావరణం, ఉష్ణోగ్రతలను బట్టి మృతదేహం భిన్న మార్పులకు లోనవుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

మరిన్ని చదవండి ఇక్కడ: Jr.NTR-Lakshmi Pranathi: సోషల్ మీడియాకు దూరంగా ఎన్టీఆర్ సతిమణీ.. పెళ్లి కాకముందు లక్ష్మీ ప్రణతి ఎలా ఉందో చూశారా..?(ఫొటోస్)

Rashmika Mandanna: అయ్యయ్యో.. అందాల ముద్దుగుమ్మను ఇలా చేశారేంటీ సుకుమార్ సర్.. రష్మిక ఎలా మారిపోయిందో చూశారా..(ఫొటోస్)

Mushrooms benifits: పుట్ట గొడుగులతో ఇన్ని ప్రయోజనాలా.. వదిలేదే ల్యా..! ఒత్తిడిని తగ్గించే పుట్టగొడుగులు.. (వీడియో)

Follow us on