Savings Scheme: గుడ్ న్యూస్.. చిన్న మొత్తాల పొదుపు పథకాల వడ్డీ రేట్లు యథాతథం..! ( వీడియో )
Post Office Savings Schemes

Savings Scheme: గుడ్ న్యూస్.. చిన్న మొత్తాల పొదుపు పథకాల వడ్డీ రేట్లు యథాతథం..! ( వీడియో )

Updated on: Jul 04, 2021 | 2:44 PM

పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్, సీనియర్ సిటిజన్స్ సేవింగ్ స్కీమ్, నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్, కిసాన్ వికాస్ పత్రా వంటి చిన్న పొదుపు పథకాల పై వడ్డీ రేట్లు మారలేదు.

పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్, సీనియర్ సిటిజన్స్ సేవింగ్ స్కీమ్, నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్, కిసాన్ వికాస్ పత్రా వంటి చిన్న పొదుపు పథకాల పై వడ్డీ రేట్లు మారలేదు. జూలై-సెప్టెంబర్ త్రైమాసికం వరకు వీటి వడ్డీ రేట్లలో మార్పులేదని ప్రభుత్వం ప్రకటించింది. చిన్న పొదుపు పథకాలపై వడ్డీ రేట్లను ప్రతీ మూడు నెలలకోసారి సమీక్షించనున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు ఈ జులై నుంచి సెప్టెంబర్ వరకు ఎటువంటి మార్పు లేకపోవడంతో ఖాతాదారులు ఊపిరి పీల్చుకున్నారు. వరుసగా ఐదోసారి ఈ పథకాలపై వడ్డీ రేట్లను ప్రభుత్వం మార్చకపోవడం విశేషం. అంతకుముందు మార్చి 31 న కేంద్ర ప్రభుత్వం చిన్న పొదుపు పథకాలపై వడ్డీ రేట్లను తగ్గిస్తున్నట్లు ప్రకటించి, మళ్లీ ఆ నోటిఫికేషన్ ను ఉపసంహరించుకుంది.

 

మరిన్ని ఇక్కడ చూడండి: Brahma Kamalam: ఉత్తరాఖండ్‌లో కనిపించే అరుదైన పుష్పం..కోనసీమలో ప్రత్యక్షం… ( వీడియో )

Mark Zuckerberg: మార్క్‌ జుకర్‌బర్గ్‌ను పట్టిస్తే… రూ. 22కోట్లు ఇస్తాం.. ( వీడియో )