SUVs cars: ఎస్‌యూవీలపై పెరిగిన మోజు.. హ్యాచ్‌బ్యాక్‌లకు తగ్గిన గిరాకీ.!
జనవరి నుంచి మే మాసాల మధ్య విక్రయించిన కార్లలో 41 శాతం ఎస్‌యూవీలు ఉన్నాయి. ఇదే సమయంలో హ్యాచ్‌బ్యాక్ మోడల్ కార్ల విక్రయాలు 49 శాతం నుంచి 35 శాతానికి పడిపోయాయి.
జనవరి నుంచి మే మాసాల మధ్య విక్రయించిన కార్లలో 41 శాతం ఎస్‌యూవీలు ఉన్నాయి. ఇదే సమయంలో హ్యాచ్‌బ్యాక్ మోడల్ కార్ల విక్రయాలు 49 శాతం నుంచి 35 శాతానికి పడిపోయాయి. ప్రతి ఐదు కార్ల కొనుగోళ్లలో రెండు ఎస్‌యూవీలేనని తేలింది. కస్టమర్ల నుంచి వస్తున్న డిమాండ్‌కు అనుగుణంగా ఫీచర్ రిచ్ ఎంట్రీ లెవెల్ ఎస్‌యూవీ కార్లను తయారు చేసేందుకు కార్ల తయారీ సంస్థలు సిద్ధం అవుతున్నాయి. తద్వారా భారత్ ఆటోమొబైల్ మార్కెట్ ఎస్‌యూవీల మార్కెట్‌గా అవతరించనున్నది. ఎస్‌యూవీ మోడల్ కార్ల విభాగంలో తమ మార్కెట్‌ను బలోపేతం చేసుకోవాలని మారుతి, హ్యుండాయ్ నిర్ణయానికి వచ్చాయి. కార్ల మార్కెట్‌లో లీడర్లుగా కొనసాగుతున్న మారుతి సుజుకి.. న్యూ వర్షన్ బ్రెజాను.. ఇక హ్యుండాయ్ మోటార్స్.. వెన్యూ ఫేస్‌లిఫ్ట్ ను ఇటీవలే ఆవిష్కరించాయి. 2021లో 6.38 లక్షల ఎస్‌యూవీ కార్లు అమ్ముడయ్యాయి. 2020, 2021లో ఎస్‌యూవీ కార్ల తయారీలో హ్యుండాయ్‌దే ఆధిపత్యం.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Collector-student: కలెక్టరమ్మకూ తప్పని తిప్పలు.. క్లాస్ రూమ్‌లోకి వెళ్లనని తనయుడు మారం..
