జుట్టు తెల్లబడటం మొదలైందా..కంగారు పడవద్దు..వెంటనే ఇలా చేయండి…(వీడియో)

|

Jan 18, 2022 | 10:24 PM

చాలామందికి జుట్టు తెల్లగా అయిపోవడం పెద్ద సమస్యగా మారుతుంది. అది క్రమేపీ మానసిక సమస్యగా కూడా పరిణమిస్తుంది. తెల్లగా మారిన జుట్టును మళ్లీ నల్లగా మార్చలేము. కానీ, మిగిలిన జుట్టు తెల్లబడకుండా కాపాడుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. వంశపారంపర్య కారణాల వల్ల గానీ..


చాలామందికి జుట్టు తెల్లగా అయిపోవడం పెద్ద సమస్యగా మారుతుంది. అది క్రమేపీ మానసిక సమస్యగా కూడా పరిణమిస్తుంది. తెల్లగా మారిన జుట్టును మళ్లీ నల్లగా మార్చలేము. కానీ, మిగిలిన జుట్టు తెల్లబడకుండా కాపాడుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. వంశపారంపర్య కారణాల వల్ల గానీ, రోగనిరోధక శక్తి తగ్గడం వల్ల గానీ జుట్టు బూడిద రంగులోకి మారుతుందని వైద్యులు చెబుతారు. విటమిన్ బి 12, విటమిన్ సి, ఇ లోపంతో పాటు, శరీరంలో జింక్, కాపర్ లోపంతో కూడా జుట్టు నెరిసిపోతుందని చెబుతారు. దీనిని నివారించడానికి, అన్నింటి కన్నా ముందు ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ అవసరం. ముఖ్యంగా పౌష్టికాహారం తీసుకోవడం ద్వారా శరీరానికి అవసరమైన అన్ని విటమిన్లు లభిస్తాయి. నారింజ, నిమ్మ, ద్రాక్ష, టమోటాలు, మొలకలు, ఆకు కూరలు వంటి సిట్రస్ పండ్లను ఆహారంలో తీసుకోవాలి.ఉసిరికాయ రోగనిరోధక శక్తిని పెంచుతుంది అలాగే, ఇది జుట్టు నెరిసిపోకుండా చేస్తుంది. కాబట్టి రోజూ ఒక గ్లాసు నీటిలో ఒక ఉసిరికాయ రసాన్ని కలుపుకుని త్రాగాలి. ఎండిన ఉసిరికాయను ఇనుప బాణలిలో వేయించి మెత్తగా రుబ్బుకోవాలి. ఈ పొడిని హెన్నా పేస్ట్‌లో కలిపి అప్లై చేయడం వల్ల జుట్టు తెల్లబడదు. జుట్టు నెరవడం ఆగుతుంది. కెమికల్ బేస్డ్ హెయిర్ కలర్స్ వాడే వారు జుట్టు విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. రెగ్యులర్ గా ఆయిల్ మసాజ్ చేసుకోవాలి. ఇందుకోసం ఒక చెంచా కొబ్బరినూనె, ఒక చెంచా ఆముదం మిక్స్ చేసి జుట్టుకు పట్టించాలి. తర్వాత టవల్‌ను వేడి నీటిలో ముంచి, నీటిని పిండేసి.. వేడి టవల్‌ను తలకు తలకు చుట్టుకొని 5 నిమిషాల పాటు అలాగే ఉంచాలి. ఇలా మూడు నాలుగు సార్లు చేయాలి. ఇది జుట్టు, స్కాల్ప్ నూనెను బాగా పీల్చుకోవడానికి సహాయపడుతుంది. ఇలా వారానికి రెండు సార్లు చేయడం వల్ల జుట్టు నెరసిపోవడం ఆగిపోయి జుట్టు మృదువుగా.. ఆరోగ్యంగా మారుతుంది. కరివేపాకును ఆహారంలో చేర్చుకోవడం వల్ల వెంట్రుకల మూలాలు.. ఫోలికల్స్ బలపడతాయి. ఇవి బీటా-కెరోటిన్.. ప్రొటీన్లకు మంచి మూలాలు. జుట్టు ఆరోగ్యానికి కూడా మేలు చేస్తాయి. కరివేపాకు తీసుకోవడం వల్ల జుట్టు రాలడం, నెరవడం ఆగిపోతుంది. వాటిలో కాల్షియం, ఫాస్పరస్, ఐరన్, ఫోలిక్ యాసిడ్, విటమిన్లు A, B, C అలాగే E కూడా ఉన్నాయి. కరివేపాకు పేస్ట్‌ని జుట్టుకు పట్టించి, 20 నుంచి 30 నిమిషాల తర్వాత కడిగేయండి. జుట్టు నెరసిపోకుండా నిరోధించడానికి ఇది గ్రేట్ హోం రెమెడీ.

Published on: Jan 18, 2022 09:53 PM