Hybrid Kidney Video: హైబ్రిడ్‌ మూత్రపిండంతో డయాలసిస్‌కు గుడ్‌బై..? కృత్రిమంగా కిడ్నీ తయారీ(వీడియో)

|

Sep 22, 2021 | 10:37 PM

కిడ్నీ సమస్యలున్నవారు ఇకపై డయాలసిస్‌కు గుడ్‌బై చెప్పనున్నారా? అంటే అవుననే అంటున్నారు శాస్త్రవేత్తలు. మూత్రపిండాల సమస్యలున్న వారు తరచూ కృత్రిమ పద్ధతులతో శరీరంలోని మలినాలను తొలగించుకుంటారు. అయితే...

కిడ్నీ సమస్యలున్నవారు ఇకపై డయాలసిస్‌కు గుడ్‌బై చెప్పనున్నారా? అంటే అవుననే అంటున్నారు శాస్త్రవేత్తలు. మూత్రపిండాల సమస్యలున్న వారు తరచూ కృత్రిమ పద్ధతులతో శరీరంలోని మలినాలను తొలగించుకుంటారు. అయితే ఈ డయాలసిస్‌కి త్వరలోనే గుడ్‌బై చెప్పే అవకాశం ఉందట. కాలిఫోర్నియా వర్సిటీ శాస్త్రవేత్తలు కృత్రిమ కిడ్నీలను తయారు చేస్తున్నారట. ఇవి త్వరలోనే అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. సిలికాన్‌ ఫిల్టర్‌తోపాటు సజీవమైన రీనల్‌ కణాలతో కూడిన ఈ హైబ్రిడ్‌ కిడ్నీ నమూనా ఇప్పటికే సిద్ధంకాగా… తొలి ప్రయోగాలు విజయవంతమయ్యాయి కూడా. ఈ హైబ్రిడ్‌ కిడ్నీ ఒకసారి శరీరంలో అమర్చుకుంటే చాలు. బ్యాటరీల అవసరమూ లేకుండా మన రక్తం ప్రవహించే ఒత్తిడితోనే దాంట్లోని మలినాలను తొలగిస్తుందట.

“ద కిడ్నీ” ప్రాజెక్ట్‌ పేరుతో కాలిఫోర్నియా వర్సిటీ వారు ఈ హైబ్రీడ్‌ కిడ్నీని తయారు చేస్తున్నారు. ఇది కేవలం అరచేతిలో ఇమిడిపోయేంత చిన్న సైజులో ఉంటుంది. కంప్యూటర్‌ చిప్‌ల తయారీలో ఉపయోగించే సిలికాన్‌ సాయంతో అతిసూక్ష్మమైన రంధ్రాలున్న ఫిల్టర్‌ను తయారు చేశారు. దీనిలో పలుచటి సిలికాన్‌ ఫిల్టర్‌ పొరలు ఒకవైపు.. రక్తంలో ఉండాల్సిన నీరు, ఇతర లవణాలను నియంత్రించే రీనల్‌ ట్యూబులు, సెల్స్‌తో కూడిన బయో రియాక్టర్‌ ఇంకోవైపు ఉంటాయి. ఇక రోగి తాలూకూ రోగ నిరోధక వ్యవస్థ ఈ కణాలపై దాడి చేయకుండా తగిన రక్షణ ఏర్పాట్లు కూడా ఇందులో ఉన్నాయి. గతంలో ఈ రెండు భాగాలను విడివిడిగా నిర్వహించిన పరీక్షలు విజయవంతం అయ్యాయి. తాజాగా రెండింటినీ కలిపి పరీక్షించారు. శరీరంలోని రెండు ప్రధాన ధమనులకు ఈ హైబ్రిడ్‌ మూత్రపిండాన్ని అనుసంధానిస్తారు. శుద్ధి చేయాల్సిన రక్తం ఒక గొట్టం గుండా దీంట్లోకి ప్రవేశిస్తుంది. శుద్ధి చేసిన రక్తం మళ్లీ ఇంకో ధమని ద్వారా శరీరంలోకి చేరుతుంది. వ్యర్థాలన్నింటినీ మూత్రాశయానికి మళ్లిస్తుంది. ఈ కృత్రిమ కిడ్నీ అందుబాటులోకి వస్తే కిడ్నీ సమస్యలు ఉన్నవారికి డయాలసిస్‌ బాధలు తప్పే అవకాశం ఉంది.
మరిన్ని చదవండి ఇక్కడ : ఖాతాదారులకు గుడ్‌న్యూస్… పండగ సీజన్‌లో ఫెస్టివల్‌ బొనాంజా బంపర్‌ ఆఫర్‌..! (వీడియో)

 CM KCR-Bandi Sanjay: సీఎం కేసీఆర్‌ క్షమాపణ చెప్పాలి.. ఘాటుగా స్పందించిన బండి సంజయ్(వీడియో)

 Jaipur hotel Video: ఈ హోటల్‌‌లో ఆ గది వెరీ స్పెషల్.. ఒక రోజు ఆ గది అద్దె డబ్బుతో ఒక ఇంటిని కొనుగోలు చేయొచ్చు(వీడియో)

 Oil Purify Test vide: మీరు వాడే నూనె స్వచ్ఛమైనదేనా.. తెలుసుకోండి ఇలా..!(వీడియో)

Published on: Sep 22, 2021 07:57 PM