EPFO Balance: EPFO కీలక అప్‌డేట్‌.. ఫైనల్‌ సెటిల్‌మెంట్‌ చేసుకున్న వారికి ఆఫర్.

|

Jul 15, 2024 | 10:34 AM

ఈపీఎఫ్‌ ఖాతాల్లో నిల్వలపై చెల్లించే వడ్డీకి సంబంధించి.. ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ EPFO అప్‌డేట్‌ ఇచ్చింది. ఫైనల్‌ పీఎఫ్‌ సెటిల్‌మెంట్‌ చేస్తున్న ఉద్యోగులకు సవరించిన వడ్డీ రేట్లను చెల్లిస్తున్నట్లు తెలిపింది. అంటే రిటైర్ అయిన ఉద్యోగులకు ఈ చెల్లింపులు చేస్తున్నట్లు పేర్కొంది. 2023-24 ఆర్థిక సంవత్సరానికి వడ్డీ చెల్లింపుల గురించి యూజర్ల నుంచి తరచూ ప్రశ్నలు వస్తున్న నేపథ్యంలో ఈపీఎఫ్‌ఓ నుంచి ఈ ప్రకటన వచ్చింది.

ఈపీఎఫ్‌ ఖాతాల్లో నిల్వలపై చెల్లించే వడ్డీకి సంబంధించి.. ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ EPFO అప్‌డేట్‌ ఇచ్చింది. ఫైనల్‌ పీఎఫ్‌ సెటిల్‌మెంట్‌ చేస్తున్న ఉద్యోగులకు సవరించిన వడ్డీ రేట్లను చెల్లిస్తున్నట్లు తెలిపింది. అంటే రిటైర్ అయిన ఉద్యోగులకు ఈ చెల్లింపులు చేస్తున్నట్లు పేర్కొంది. 2023-24 ఆర్థిక సంవత్సరానికి వడ్డీ చెల్లింపుల గురించి యూజర్ల నుంచి తరచూ ప్రశ్నలు వస్తున్న నేపథ్యంలో ఈపీఎఫ్‌ఓ నుంచి ఈ ప్రకటన వచ్చింది. 2023-24 ఆర్థిక సంవత్సరానికి ఈపీఎఫ్‌ నిల్వలపై 8.25 శాతం వడ్డీని ఖరారు చేస్తూ మే 31న కేంద్ర ప్రభుత్వం నోటిఫై చేసినట్లు ఈపీఎఫ్‌ఓ ఎక్స్‌ వేదికగా పోస్ట్‌ చేసింది. 2023-24 మధ్యలో, 2024-25 ఆర్థిక సంవత్సరంలో ప్రారంభంలో ఫైనల్‌ సెటిల్‌మెంట్‌ చేసుకున్న వారిందరికీ సవరించిన వడ్డీనే చెల్లించినట్లు ఈపీఎఫ్‌ తెలిపింది. ప్రభుత్వం నోటిఫై చేసిన తర్వాత సవరించిన వడ్డీ ప్రయోజనం అందాలన్న ఉద్దేశంతో ఫైనల్‌ సెటిల్‌మెంట్లు చేసుకుంటున్న మెంబర్లందరికీ అదే వడ్డీని చెల్లిస్తున్నట్లు పేర్కొంది. ప్రస్తుత ఖాతాదారులకు అదే వడ్డీ త్వరలో అందుతుందని, ఎప్పుడనేది మాత్రం స్పష్టత ఇవ్వలేదు.

సాధారణంగా ప్రతి ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వడ్డీ రేటును తదుపరి ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో ఖరారు చేస్తారని, ఆ విధంగా మే నెలలో వడ్డీని ఖరారు చేసినట్లు ఈపీఎఫ్ఓ తెలిపింది. ఇటీవల సంవత్సరాల్లో ఇదే అత్యధిక వడ్డీ అని పేర్కొంది. చిన్న మొత్తాల పొదుపు పథకాలు, జీపీఎఫ్‌, పీపీఎఫ్‌ వడ్డీ రేట్లతో పోలిస్తే ఇదే అధికమని తెలిపింది. అంతకుముందు ఆర్థిక సంవత్సరానికి (2022-23) వడ్డీ రేటును 8.15 శాతంగా నిర్ణయించారు. ఈపీఎఫ్‌ఓ వడ్డీని ఉమాంగ్‌ యాప్‌లోకి వెళ్లి యూఏఎన్‌, ఓటీపీ ఎంటర్‌ చేసి తెలుసుకోవచ్చు. ఈపీఎఫ్‌ మెంబర్‌ పోర్టల్‌లోకి వెళ్లి కూడా యూఏఎన్‌, పాస్‌వర్డ్‌ ఎంటర్ చేసి వివరాలు తెలుసుకోవచ్చు. లేదంటే 99660 44425 నంబర్‌కు మిస్డ్‌ కాల్‌ ఇవ్వొచ్చు. EPFOHO అని టైప్‌ చేసి UAN నంబర్‌ ఎంటర్ చేసి 7738299899 నంబర్‌కు ఎస్సెమ్మెస్‌ చేసి కూడా నిల్వల సమాచారం పొందొచ్చు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.