EPFO – Aadhar card: ఇకపై దీనికి ఆధార్‌ ప్రూఫ్‌ చెల్లదు.! స్పష్టం చేసిన EPFO.

|

Jan 20, 2024 | 3:47 PM

ఆధార్‌ కార్డు ప్రతి ఒక్కరి జీవితంలో ముఖ్యమైన భాగమైపోయింది. బ్యాంకు అకౌంట్‌ నుంచి ఓటర్‌ ఐడి, పాన్‌ ఇలా రకరకాల వాటికి ఆధార్‌ ను అనుసంధానించడం తప్పనిసరి అయిపోయింది. అయితే ఆధార్ కార్డు విషయంలో ఎంప్లాయీస్‌ ప్రావిడెంట్ ఫండ్‌ ఆర్గనైజేషన్‌ EPFO ఓ కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు పుట్టిన తేదీని అప్‌డేట్‌ చేసేందుకు, లేదా సవరించేందుకు ఆధార్‌ కార్డు చెల్లుబాటు కాదని స్పష్టం చేసింది. అంటే EPFO ​​ఇకపై ఈ ప్రయోజనం కోసం ఆధార్ కార్డును ఉపయోగించదు.

ఆధార్‌ కార్డు ప్రతి ఒక్కరి జీవితంలో ముఖ్యమైన భాగమైపోయింది. బ్యాంకు అకౌంట్‌ నుంచి ఓటర్‌ ఐడి, పాన్‌ ఇలా రకరకాల వాటికి ఆధార్‌ ను అనుసంధానించడం తప్పనిసరి అయిపోయింది. అయితే ఆధార్ కార్డు విషయంలో ఎంప్లాయీస్‌ ప్రావిడెంట్ ఫండ్‌ ఆర్గనైజేషన్‌ EPFO ఓ కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు పుట్టిన తేదీని అప్‌డేట్‌ చేసేందుకు, లేదా సవరించేందుకు ఆధార్‌ కార్డు చెల్లుబాటు కాదని స్పష్టం చేసింది. అంటే EPFO ​​ఇకపై ఈ ప్రయోజనం కోసం ఆధార్ కార్డును ఉపయోగించదు. ఈపీఎఫ్‌వో చెల్లుబాటు అయ్యే పత్రాల జాబితా నుండి దీనిని మినహాయించింది. ఈ మేరకు EPFO సర్క్యులర్ కూడా జారీ చేసింది. EPFO వివరాల ప్రకారం.. జనన ధృవీకరణ పత్రం ద్వారా పుట్టినతేదీ మార్పు చేసుకోవచ్చు. ఇదే కాకుండా మార్క్ షీట్, స్కూల్ లీవింగ్ సర్టిఫికేట్ లేదా ఏదైనా ప్రభుత్వ బోర్డు లేదా విశ్వవిద్యాలయం నుండి పొందిన పాఠశాల బదిలీ సర్టిఫికేట్ కూడా ఈ ప్రయోజనం కోసం ఉపయోగించవచ్చు. ఇది కాకుండా, సివిల్ సర్జన్ జారీ చేసిన మెడికల్ సర్టిఫికేట్, పాస్‌పోర్ట్, పాన్ నంబర్, ప్రభుత్వ పెన్షన్ సర్టిఫికేట్‌, మెడిక్లెయిమ్ సర్టిఫికేట్, నివాస ధృవీకరణ పత్రాన్ని ఉపయోగించవచ్చని తెలిపింది.

ఇక ఆధార్ కార్డును గుర్తింపు కార్డుగా, నివాస ధృవీకరణ పత్రంగా ఉపయోగించాలని యూఐడీఏఐ తెలిపింది. కానీ, దానిని జనన ధృవీకరణ పత్రంగా ఉపయోగించకూడదు. ఆధార్ అనేది 12 అంకెల ప్రత్యేక గుర్తింపు కార్డు. ఇది భారత ప్రభుత్వంచే జారీ చేయబడింది. ఇది మీ గుర్తింపు, శాశ్వత నివాసానికి రుజువుగా దేశవ్యాప్తంగా చెల్లుబాటు అవుతుంది. అయితే, ఆధార్‌ను క్రియేట్ చేస్తున్నప్పుడు, వ్యక్తులు వివిధ పత్రాల ప్రకారం వారి పుట్టిన తేదీని నమోదు చేశారు. అందుకే ఇది జనన ధృవీకరణ పత్రానికి ప్రత్యామ్నాయంగా పరిగణించరాదని తెలిపింది. వివిధ న్యాయస్థానాలు ఆధార్ చట్టం 2016పై అనేకసార్లు తమ వైఖరిని స్పష్టం చేశాయి. ఇటీవల బాంబే హైకోర్టు కూడా మహారాష్ట్ర వర్సెస్‌ UIDAI, ఇతర కేసులలో ఆధార్ నంబర్‌ను గుర్తింపు కార్డుగా ఉపయోగించాలని, జనన ధృవీకరణ పత్రంగా ఉపయోగించకూడదని తెలిపింది. దీని తరువాత UIDAI డిసెంబర్ 22, 2023 న ఒక సర్క్యులర్ జారీ చేసింది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos