Indian Railways: రైల్వే శాఖ కీలక నిర్ణయం.. ఇందులో ఉమ్మితే మొక్కలు పెరుగుతాయ్.. వీడియో
మన దేశంలో అతిపెద్ద ప్రజారవాణా సంస్థ ఏదంటే అది ఇండియన్ రైల్వే అనే చెప్పాలి. భారతీయ రైల్వే నిత్యం లక్షలాది మందిని తమతమ గమ్యస్థానాలకు చేర్చుతోంది. ఒక విధంగా చెప్పాలంటే సామాన్యుడికి కూడా మెరుగైన రవాణా వ్యవస్థ అని చెప్పొచ్చు.
మన దేశంలో అతిపెద్ద ప్రజారవాణా సంస్థ ఏదంటే అది ఇండియన్ రైల్వే అనే చెప్పాలి. భారతీయ రైల్వే నిత్యం లక్షలాది మందిని తమతమ గమ్యస్థానాలకు చేర్చుతోంది. ఒక విధంగా చెప్పాలంటే సామాన్యుడికి కూడా మెరుగైన రవాణా వ్యవస్థ అని చెప్పొచ్చు. అయితే కొందరు ప్రయాణికుల చేష్టల వల్ల రైల్వేకి పెద్ద సమస్య వస్తోంది. వారి అలవాట్ల కారణంగా రైల్వే వ్యవస్థకు ప్రతియేడాది వేల కోట్ల రూపాయలు ఖర్చు అవుతోంది. అసలు విషయం ఏంటంటే చాలామంది రైలు ప్రయాణం చేసే సమయంలో రైళ్లల్లో పాన్‌లు, గుట్కాలు, పొగాకు నమిలి ఉమ్మి వేయడం వల్ల రైళ్లు, రైల్వే స్టేషన్ల పరిసరాల్లో మరకలు పడటం సర్వసాధారణంగా మారింది. ఇలాంటి పరిస్థితులను మార్చేందుకు రైల్వే శాఖ చర్యలు చేపడుతోంది. ఇలా ప్రయాణికులు నిర్లక్ష్యంగా ఉమ్మి వేయడం వల్ల ఏర్పడిన మరకలు తొలగించడం కోసం రైల్వే శాఖ భారీగా ఖర్చు చేయాల్సి వస్తోంది. దీనికోసం భారీ మొత్తంలో నీటితో పాటు సుమారు 12 వేల కోట్ల రూపాయలను రైల్వే శాఖ ఏటా ఖర్చు చేస్తున్నట్లు అంచనా.
మరిన్ని ఇక్కడ చూడండి: Mystery Rivers: భూమి కింద ప్రవహించే నదులు గురించి మీకు తెలుసా..? వీడియో
వీడు మామూలోడు కాదు.. పరీక్షల్లో కాపీయింగ్ కోసం ఏంచేసాడో చూడండి! వీడియో