Exam Preparation: పిల్లల పరీక్షలు దగ్గరకొచ్చేశాయి.. తల్లిదండ్రుల పైనే భారమంతా..! జాగ్రత్త..!

|

Feb 23, 2023 | 6:05 PM

ఎగ్జామ్స్‌ అనగానే పిల్లలకు ఎక్కువగా కొందరు తల్లిదండ్రులు టెన్షన్‌ పడిపోతారు. ఇలాంటివారే తమకు తెలియకుండానే పిల్లలపై ఒత్తడిని పెంచుతారు. పరీక్షలను ఓ నార్మల్‌ ప్రక్రియగానే పరిగణించాలి

పిల్లల పరీక్షలు దగ్గరకొచ్చేశాయి. సహజంగానే పిల్లలపై పరీక్షల ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. బోర్డు ఎగ్జామ్స్‌ ఉన్న పిల్లలకైతే ఇంకొంచెం ఎక్కువ ప్రెజర్‌ ఉంటుంది. ఎగ్జామ్స్‌ ప్రిపరేషన్స్‌ దగ్గర నుంచి ఎగ్జామ్ హాల్లోకి వెళ్లేంత వరకు ప్రతి నిమిషం ఇప్పుడు ఇంపార్టెంటే. ఈ విషయంలో తల్లిదండ్రుల పాత్ర కూడా చాలా ముఖ్యమైంది. పిల్లల్లో మానసిక ఒత్తిడి లేకుండా, సబ్జెక్టులను కష్టంగా కాకుండా ఇష్టంగా చదువుకునేందుకు అందుకు తగిన వాతావరణాన్ని పేరంట్స్‌ కల్పించాలి. తల్లిదండ్రులిద్దరూ జాబ్‌ చేస్తున్నవారైతే పరీక్షల సమయంలో ఉద్యోగాలకు సెలవులు పెట్టడం మంచిది. తద్వారా వారు పిల్లల ఒత్తిడిని తగ్గించగలుగుతారు. ఇంటిపట్టున పేరంట్స్‌ ఉంటే పిల్లలు చదువు చక్కగా సాగుతుంది. ఎగ్జామ్స్‌ టైమ్‌ టేబుల్‌ వచ్చింది కదాని నిరంతరం చదువు, పరీక్షల గురించే మాట్లాడకూడదు.. ఇది పిల్లలపై అనవసరమైన ఒత్తిడిని కలిగిస్తుంది. పిల్లలకు కూడా రిలాక్సేషన్‌ అవసరం. మంచి మార్కులు తెచ్చుకోవడానికి చదువు ఎంత ముఖ్యమో, సంతోషంగా, ప్రశాంతగా ఉండటం కూడా అంతే ముఖ్యం. పిల్లలకు రోజుకు ఒకట్రెండుసార్లు చిన్నపాటి విరామం ఇవ్వాలి. ఆ టైమ్‌లో పిల్లలను తమకు ఇష్టమైన పనులు చేసుకోనివ్వండి. అంటే పాటలు వినడం, టీవీ చూడటం, వీడియోలు వీక్షించడం వంటివన్నమాట. ఇలా చేయడం వల్ల తమను తాము రిఫ్రెష్‌ చేసుకునేవారవుతారు. ఇందులో పేరంట్స్‌ కూడా పాల్గొనవచ్చు. ఎగ్జామ్స్‌ అనగానే పిల్లలకు ఎక్కువగా కొందరు తల్లిదండ్రులు టెన్షన్‌ పడిపోతారు. ఇలాంటివారే తమకు తెలియకుండానే పిల్లలపై ఒత్తడిని పెంచుతారు. పరీక్షలను ఓ నార్మల్‌ ప్రక్రియగానే పరిగణించాలి. ఎప్పటిలాగే పిల్లలతో కలిసి టీవీ చూడటం, కలిసి భోంచేయడం వంటివి చేయాలి. పిల్లలకు కావాల్సినవి చేసిపెట్టండి. వారి చిన్న చిన్న కోరికలను తీర్చండి. ఆచరణాత్మక సూచనలు ఇవ్వండి. మార్కులు మేథస్సుకు ప్రతీకలు కావని, అవి ఫ్యూచర్‌ను నిర్ణయించవని అర్థమయ్యేలా చెప్పండి. బాగా చదవితే ఆటోమాటిక్‌గా మార్కులు అవే వస్తాయని వివరించండి. ఫలితం ఎలా ఉన్నా తాము సహృదయతో అంగీకరిస్తామని పిల్లలకు భరోసా ఇవ్వండి.

పిల్లలు ఒత్తిడిలో ఉన్నప్పుడు ఇమేజరీ టెక్నిక్ పని చేస్తుంది. కళ్ళు మూసుకుని గత విజయాలను గుర్తు తెచ్చుకోమని పిల్లలకు చెప్పండి. తెలియని ఆనందం వారికి కలుగుతుంది. ఎక్సర్‌సైజ్‌, వాకింగ్‌, స్కెచింగ్‌, సంగీతం వినడం వంటి వారి దినచర్యలో విశ్రాంతి నిమిషాలను కూడా కలపండి. ఇది ఎంతో ముఖ్యం. దీనివల్ల వారికి ఉపశమనం కలుగుతుంది. రీడింగ్ రూమ్‌ బాగుండేట్టు చూసుకోవాలి. నాచురల్‌ లైట్‌ వచ్చేట్టుగా ఉండాలి. గదిలో వస్తువులు చిందరవందరగా ఉండకూడదు. ఓ పద్దతి ప్రకారం పేర్చేట్టుగా ఉండాలి. గదిలో తాజా పువ్వులు కానీ, ఇండోర్‌ మొక్కలను కానీ ఉంచండి. పిల్లల పాదాలను పావుగంట పాటు గోరువెచ్చని నీటిలో ఉంచితే మంచిది.పరీక్షల సమయంలో పిల్లల ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. తేలికైన, ఆరోగ్యకరమైన తొందరగా జీర్ణమయ్యే ఆహారాన్ని ఇవ్వాలి. విటమిన్ సి కలిగిన పండ్లు, డ్రై ఫ్రూట్స్, పెరుగు, డార్క్ చాక్లెట్ డైట్‌లో ఉండేట్టు చూసుకోవాలి. పిల్లలతో కూరొచ్చి టైమ్‌టేబుల్‌ను రూపొందించండి. అంటే ఏ కోర్సును ఎప్పుడు పూర్తి చేయాలి, ఎప్పుడు పునర్విమర్శ చేయాలి వంటివాటిలో ప్లానింగ్‌ ఉండాలన్నమాట. గత సంవత్సరపు కొశ్చన్‌ పేపర్లను పరిశీలిస్తే ఎలాంటి ప్రశ్నలు అడిగారన్నదానిపై క్లారిటీ వస్తుంది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Condom: కడుపులో కనిపించిన కండోమ్..! కడుపునొప్పితో ఆస్పత్రికి వెళ్లిన వ్యక్తి రిపోర్ట్‌ చూసి వైద్యులు షాక్‌.

Wife – Husband: భర్త నాలుకను కరకర కొరికేసిన భార్య.. ఎందుకో తెలుసా.. ట్రెండ్ అవుతున్న వీడియో.

Motehr and Son: నువ్వు సూపర్‌ బ్రో.. కొడుకంటే నీలా ఉండాలి..! అమ్మ తన ఆఫీస్‌ చూడాలని..

Published on: Feb 23, 2023 06:05 PM