fight for Rs.35: రూ.35 కోసం ఐదేళ్లు పోరాడాడు.. ఎందుకో తెలిస్తే హ్యాట్సాఫ్ అంటారు.! కానీ…
35 రూపాయల రీఫండ్ కోసం ఇండియన్ రైల్వే డిపార్ట్‌మెంట్‌తో ఐదేళ్లు పోరాటం చేశాడు ఓ వ్యక్తి. చివరకు తన పోరాటం ఫలించింది. రైల్వే శాఖ దిగొచ్చింది. అతని 35 రూపాయలు అతనికి తిరిగి ఇచ్చేసింది. అంతేకాదు.. అతను చేసిన పోరాటం..
35 రూపాయల రీఫండ్ కోసం ఇండియన్ రైల్వే డిపార్ట్‌మెంట్‌తో ఐదేళ్లు పోరాటం చేశాడు ఓ వ్యక్తి. చివరకు తన పోరాటం ఫలించింది. రైల్వే శాఖ దిగొచ్చింది. అతని 35 రూపాయలు అతనికి తిరిగి ఇచ్చేసింది. అంతేకాదు.. అతను చేసిన పోరాటం.. దాదాపు 3 లక్షల మందికి సహాయపడింది. వివరాల్లోకి వెళ్తే..మనం బస్సుల్లోనో, ఆటోలోనో ప్రయాణం చేస్తున్నప్పుడు చిల్లర లేదనే కారణంతో ఎంతో కొంత డబ్బులు వదులకోవాల్సి వస్తుంది. కానీ, కొందరు మాత్రం అలా వదలరు. తమ డబ్బులు తమకు ఇవ్వాలంటే ఇవ్వాలని పట్టుబడతారు. రాజస్థాన్‌కు చెందిన ఓ యువ ఇంజనీర్ సుజీత్ కూడా అలాగే చేశాడు. సుజీత్ స్వామి ఢిల్లీ నుంచి గోల్డెన్ టెంపుల్ వెళ్లడానికి 2017, ఏప్రిల్‌లో ఐఆర్సీటీసీ ద్వారా టికెట్ బుక్ చేసుకున్నాడు. ఆ తరువాత ఏవో కారణాల చేత తన టికెట్‌ను క్యాన్సల్ చేసుకున్నాడు. అయితే, 2017 జులై 1 నుంచి జీఎస్టీ అమల్లోకి రాగా, అంతకు ముందే అతను టికెట్ క్యాన్సిల్ చేసుకున్నప్పటికీ.. జీఎస్టీ, సర్వీస్ ఛార్జెస్ పేరుతో 35 రూపాయలు ఎక్కువ కట్ చేసుకుంది రైల్వే శాఖ. దీనిని సీరియస్‌గా తీసుకున్న సుజీత్.. 35 రూపాయల కోసం ఐదేళ్లుగా ఆర్టీఐ దరఖాస్తులతో రైల్వే శాఖను ఊపిరి సలపకుండా చేశాడు. అతని దెబ్బకు దిగొచ్చిన రైల్వే.. సుజీత్‌కు 35 రూపాయలు రిఫండ్ చేసింది. అంతేకాదు.. అతని మాదిరిగానే ఛార్జీల పేరుతో 2.98 లక్షల మందికి కట్ చేయగా.. వారందరికీ మొత్తం 243 కోట్లను రిఫండ్ చేసింది రైల్వే శాఖ. అయితే, అలా సుజీత్ చేసిన పోరాటం ఫలించింది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Sorry: పుణ్యం కోసం రామకోటి రాస్తారు.. మరీ సారీ కోటి ఏంటో..? గోడలు, మెట్లు, చెట్టు, కొమ్మ అంతటా సారీ, సారీ..
Rashmika Mandanna: క్రష్మిక క్రష్ ఎవరో చెప్పేసింది.. స్కూల్ డేస్ నుంచి అతనంటే చాలా ఇష్టం..!
Man dies in hotel: హోటల్‌లో ప్రేయసితో శృంగారం చేస్తూ వ్యక్తి మృతి.. ఏం జరిగిందంటే..?
Google Search: ఈ 3 విషయాలు గూగుల్‌లో సెర్చ్ చేయకండి.. చేస్తే జైలుకెళ్లడం కన్ఫమ్..!