40 ఏళ్లు దాటాయా.. ఇది మీ కోసమే

Updated on: May 11, 2025 | 9:40 AM

శరీరం ఆరోగ్యంగా, చర్మం అందంగా ఉండాలంటే శరీరంలో కొల్లాజెన్ చాలా ముఖ్యం. 40 ఏళ్ళు దాటగానే వృద్ధాప్య చిహ్నాలు మొదలవుతాయి. 40లో కూడా 20లా ఉండాలంటే మీరు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. కొల్లాజెన్ వృద్ధాప్యాన్ని దూరంగా ఉంచుతుంది. కొల్లాజెన్ కారణంగా చర్మం ముడతలు పడకుండా ఉంటుంది. కొల్లాజెన్ తగినంత శరీరంలో ఉంటే చర్మం మెరుస్తూ యవ్వనంగా కనిపిస్తుంది.

40 సంవత్సరాల తర్వాత శరీరంలో కొల్లాజెన్ ఉత్పత్తి తగ్గడం ప్రారంభమవుతుంది. కాబట్టి మీ అందం తగ్గకుండా ఉండేందుకు శరీరంలో కొల్లాజెన్ నిర్వహించడానికి ఈ వంటింటి చిట్కాలు అద్భుతంగా పనిచేస్తాయి. వాటితో మరింత ఎక్కువ కాలం యవ్వనంగా, చర్మం కాంతివంతంగా, అందంగా కనిపిస్తుంది. విటమిన్ సి కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచడానికి సహాయపడుతుంది. అందుకే ప్రతిరోజు సి విటమిన్ అధికంగా ఉండే ఆహారం తీసుకోండి. మీ ఆహారంలో ఆమ్లా, నారింజ, నిమ్మ, కివి, బ్రోకలీ, ఆకుపచ్చ కూరగాయలను చేర్చుకోండి. దీంతోపాటు ఉదయం చర్మంపై విటమిన్ సి సీరం అప్లై చేసుకోవడం అలవాటు చేసుకోండి. కొల్లాజెన్ పెంచడానికి ప్రోటీన్, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉండే ఆహారం చాలా అవసరం. అందుకు గుడ్లు, సోయా, పప్పులు, గింజలు తీసుకోండి. బోన్ సూప్ కూడా కొల్లాజెన్ ఉత్పత్తికి తోడ్పడుతుంది. క్రమం తప్పకుండా ప్రతిరోజూ 10 నిమిషాలు ఫేస్ మసాజ్, యోగా చేయండి. బయటే కాదు ఇంట్లో కూడా సన్‌స్క్రీన్ అప్లై చేసుకోండి. ఎస్పిఎఫ్ 30 ప్లస్ ఉన్న బ్రాడ్ స్పెక్ట్రం సన్‌స్క్రీన్ ఉపయోగించండి. ప్రతిరోజూ 7 నుంచి 8 గంటల పాటు నిద్రపోవడానికి ప్రయత్నించండి. దీంతోపాటు ధ్యానం చేయండి.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

విటమిన్ బి12 లోపిస్తే చిక్కులేనా..?

చిరుతను హత్తుకుని ముద్దు పెట్టబోయింది !! ఏం జరిగిందంటే..?

తందూరి రోటీ కోసం పెళ్లిలో గొడవ ఇద్దరు యువకులు మృ**తి

కంటి దురదను వదిలించుకోవడానికి సింపుల్ టెక్నిక్స్ !

ఆర్బీఐ రూ.500 నోట్లను రద్దు చేస్తుందా ?? ఇదిగో క్లారిటీ