పీఎం ఇంటర్న్‌షిప్‌ కు అప్లయ్ చేశారా ?? రూ.66 వేలు ఇస్తారు.. ఎలా అంటే ??

|

Nov 12, 2024 | 9:03 PM

యువతకు నైపుణ్యాలు నేర్పించి.. ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ప్రయోగాత్మకంగా ప్రారంభించిన పీఎం ఇంటర్న్‌షిప్‌ స్కీమ్‌కు దరఖాస్తుల గడువు ముగుస్తోంది. అర్హులైన, ఆసక్తి కలిగిన అభ్యర్థులు www.pminternship.mca.gov.in ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. అక్టోబర్‌ 12న మొదలైన దరఖాస్తుల ప్రక్రియ నవంబర్‌ 10తో ముగుస్తుంది. ఈలోగా అభ్యర్థులు తమ పేర్లను పోర్టల్‌లో పేర్లు నమోదు చేసుకొని, దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

రాబోయే ఐదేళ్లలో టాప్‌ 500 కంపెనీల్లో కోటి మందికి నైపుణ్యాలు కల్పించడమే లక్ష్యంగా కేంద్రం ఈ పథకానికి శ్రీకారం చుట్టింది. 2024-25లో పైలట్ ప్రాజెక్ట్ కింద చేపట్టే ఈ కార్యక్రమానికి 8 వందల కోట్ల రూపాయల ఖర్చుతో డిసెంబర్‌ నుంచి ఇంటర్న్‌షిప్‌ మొదలుపెట్టనుంది. ఈ ఆర్థిక సంవత్సరంలో దాదాపు 1.25 లక్షల మందికి ఇంటర్న్‌షిప్‌ను అందించనున్నారు. ఎంపికైన అభ్యర్థులకు నెలకు 5 వేల రూపాయల చొప్పున ఏడాది పాటు ఆర్థిక సహాయం అందిస్తారు. కంపెనీలో చేరే ముందు ఇచ్చే 6 వేల రూపాయలు వన్‌టైం గ్రాంట్‌ కూడా ఉంటుంది. అంటే మొత్తం మీద ఏడాదిలో 66 వేల రూపాయలు పొదుతారు. ఈ పథకంలో స్వచ్ఛందంగా భాగస్వాములయ్యే కంపెనీలు ఏడాది పాటు ఇంటర్న్‌షిప్‌ అందిస్తాయి. ఇందులో కనీసం సగం కాలం తరగతి గదిలో కాకుండా వాస్తవ ఉద్యోగ వాతావరణంలో అభ్యర్థులు గడపాల్సి ఉంటుంది. ఇంటర్న్‌షిప్‌లో చేరినవారికి వ్యక్తిగత బీమా సౌకర్యం ఉంది. పీఎం జీవన్‌ జ్యోతి బీమా యోజన, పీఎం సురక్షా బీమా యోజన వంటి కేంద్ర ప్రభుత్వ బీమా పథకాల ద్వారా ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పిస్తారు. దీనికి కావాల్సిన ప్రీమియాన్ని ప్రభుత్వమే చెల్లిస్తుంది. నిబంధనలకు లోబడి 21 నుంచి 24 ఏళ్ల మధ్య ఉన్న యువతీ యువకులు ఈ పథకానికి అర్హులు. దూరవిద్య ప్రోగ్రామ్‌లో నమోదు చేసుకున్నవారు.. ఎస్‌ఎస్‌సీ పాసైన అభ్యర్థులతో పాటు ఐటీఐ, పాలిటెక్నిక్, బీఏ, బీఎస్సీ, బీసీఏ, బీబీఏ, బీఫార్మసీ వంటి డిగ్రీలు కలిగి ఉన్నవారందరూ దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రభుత్వ ఉద్యోగుల కుటుంబాలకు చెందినవారు, వార్షికాదాయం ₹8లక్షలు దాటిన కుటుంబాలతో పాటు ఐఐటీ, ఐఐఎం వంటి ఉన్నత విద్యాసంస్థల్లో గ్రాడ్యుయేషన్‌ చేసినవారు.. సీఏ, సీఎంఏ అర్హత కలిగినవారు ఈ ఇంటర్న్‌షిప్‌కు అనర్హులు.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఫీజు కట్టాలి.. లైసెన్స్ తీసుకోవాలి.. వాట్సాప్ అడ్మిన్లకు షాక్

Helicobacter pylori: గోరుముద్ద నుంచే పైలోరీ బ్యాక్టీరియా

Pushpa 2: మాస్ జాతర షురూ.. అభిమానులను కలవనున్న పుష్ప

ఆ రైల్లో వెళ్తున్నారా… బీ కేర్ ఫుల్ !!

రూ. 4 ల‌క్షల ఖ‌ర్చు.. 1500 మందిలో అట్టహాసంగా కారుకు “సమాధి” !!