అతి చిన్న ప్రపంచకప్‌.. క్రికెట్ ఫ్యాన్స్ ఫిదా.. వీడియో వైరల్..!

Edited By:

Updated on: Oct 26, 2023 | 8:07 PM

Small Size World Cup In Khammam District: కొత్తగూడెం చిన్న బజారుకు చెందిన కోడూరు నాగేశ్వరరావు అనే స్వర్ణకారుడు అతి చిన్నసైజ్ వరల్డ్‌కప్‌ను రూపొందించి అందరినీ అబ్బురపరిచాడు. వన్డే ప్రపంచకప్ క్రికెట్ పోటీల్లో పాకిస్థాన్‌పై టీమిండియా ఘన విజయం సాధించినందుకు గుర్తుగా అతి చిన్న ప్రపంచకప్‌ను రూపొందించి అబ్బురపరిచాడు.

కొత్తగూడెం చిన్న బజారుకు చెందిన కోడూరు నాగేశ్వరరావు అనే స్వర్ణకారుడు అతి చిన్నసైజ్ వరల్డ్‌కప్‌ను రూపొందించి అందరినీ అబ్బురపరిచాడు. వన్డే ప్రపంచకప్ క్రికెట్ పోటీల్లో పాకిస్థాన్‌పై టీమిండియా ఘన విజయం సాధించినందుకు గుర్తుగా అతి చిన్న ప్రపంచకప్‌ను రూపొందించి అబ్బురపరిచాడు. కేవలం 4 మిల్లీమీటర్ల వెడల్పు, 8 మి.మీ. ఎత్తు, 90 మిల్లీ గ్రాముల బరువుతో అతి చిన్న బంగారు ప్రపంచకప్‌ను తయారు చేసి క్రికెట్, భారత్‌పై తనకున్న అభిమానాన్ని చాటుకున్నాడు. క్రికెట్ అంటే ఎంతో మక్కువ కలిగిన నాగేశ్వరరావు.. ప్రపంచకప్ పోటీలను మొదటి నుంచి ఆసక్తిగా తిలకిస్తున్నాడు. ఈ నెల 14న పాకిస్తాన్ జట్టుపై రోహిత్ సేన ఘన విజయం సాధించిన ఆనంద క్షణాలను మదిలో పదిలంగా దాచుకోవడంతో పాటు, పదిమందితో ఆ సంతోషాన్ని పంచుకోవాలని తలచాడు. 2023 ప్రపంచకప్‌ను భారత్ కైవసం చేసుకోవాలని ఆకాంక్షిస్తూ బంగారంతో అతిచిన్న కప్‌ను రూపొందించాడు. ఈ అతి చిన్న కప్‌ను పాకిస్థాన్‌పై గెలిచిన భారత్ క్రికెట్ జట్టుకు అంకితం చేస్తున్నట్లు కోడూరు నాగేశ్వరరావు ప్రకటించాడు. ఇది క్రికెట్ అభిమానులను అమితంగా ఆకట్టుకోవడమే కాదు.. నాగేశ్వరరావును పలువురు ప్రత్యేకంగా అభినందించారు కూడా.

Published on: Oct 26, 2023 08:03 PM