ఎలైట్ క్రికెట్ లీగ్ విజేత ఖాకీ బుల్లెట్స్ టీమ్ వీడియో
ఉప్పల్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరిగిన ఎలైట్ క్రికెట్ లీగ్ ఫైనల్‌లో ఖాకీ బుల్లెట్స్ జట్టు విజేతగా నిలిచింది. సినీ వారియర్స్ రన్నరప్‌గా నిలిచింది. చామల ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ లీగ్‌లో విజేతలకు బహుమతులు అందించడంతో పాటు, అమరవీరుల కుటుంబాలకు, పోలీసు, సైనిక సంక్షేమం కోసం ₹25 లక్షలకు పైగా విరాళాలు అందజేశారు.
ఉప్పల్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో చామల ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఎలైట్ క్రికెట్ లీగ్ కప్‌ను ఖాకీ బుల్లెట్స్ టీం సొంతం చేసుకుంది. ఎలైట్ క్రికెట్ లీగ్ ఫైనల్ మ్యాచ్ ఖాకీ బుల్లెట్స్, సినీ వారియర్స్ మధ్య 20 ఓవర్ల పాటు హోరాహోరీగా సాగింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఖాకీ బుల్లెట్స్ నిర్ణీత 20 ఓవర్లకు 156 పరుగులు చేసి ఆలౌట్ అయింది. 157 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సినీ వారియర్స్ గట్టి పోటీ ఇచ్చింది కానీ 19.2 ఓవర్లలో 127 పరుగులకే ఆలౌట్ అయి, రన్నరప్‌గా నిలిచింది.
మరిన్ని వీడియోల కోసం :
