Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

KCR With TV9: నేనే కాదు.. సమాజం మొత్తం చూస్తోంది.. మద్యం అమ్మకాలపై కేసీఆర్ పంచులు..

KCR With TV9: నేనే కాదు.. సమాజం మొత్తం చూస్తోంది.. మద్యం అమ్మకాలపై కేసీఆర్ పంచులు..

Basha Shek

|

Updated on: Apr 23, 2024 | 8:28 PM

KCR With TV9: రాష్ట్రంలో మద్యం అమ్మకాలపై మాజీ ముఖ్యమంత్రి పంచ్‌లు విసిరారు.  తమ ప్రభుత్వ హయాంలో మద్యం అమ్మకాలు పెరిగితే కొన్ని పత్రికలు విషం చిమ్మాయని, ఇప్పటి ప్రభుత్వంలో పెరిగితే మాత్రం ఎండతాపం వల్ల తాగుతున్నారంటూ సమర్థిస్తూ కథనాలు ప్రచురిస్తున్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

KCR With TV9: రాష్ట్రంలో మద్యం అమ్మకాలపై మాజీ ముఖ్యమంత్రి పంచ్‌లు విసిరారు.  తమ ప్రభుత్వ హయాంలో మద్యం అమ్మకాలు పెరిగితే కొన్ని పత్రికలు విషం చిమ్మాయని, ఇప్పటి ప్రభుత్వంలో పెరిగితే మాత్రం ఎండతాపం వల్ల తాగుతున్నారంటూ సమర్థిస్తూ కథనాలు ప్రచురిస్తున్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘కొద్ది రోజుల క్రితం చాలా పత్రికలు, మీడియా ఛానెల్స్ లో ఒక వార్త వచ్చింది. 18 రోజుల్లోనే రూ. 700 కోట్ల బీర్లు తాగేశారని. ఈ బాకా, కాకా ఛానెల్స్ కానీ, కొన్ని రకాల విషం చిమ్మె పత్రికలు కానీ.. ‘కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు మద్యం అమ్మకాలు పెరిగితేనేమో కానీ.. రాష్ట్రాన్ని తాగుబోతుల మయం చేస్తున్నారని, ఈ రోజు బీర్లు, విస్కీలు, మద్యం అమ్మకాలు పెరిగితే ఎండ తాపం వల్ల తాగుతున్నారని సమర్థించాయి. అంటే మీడియాలో ఉన్న ఒక సెక్షన్ వికృత రూపం కూడా ఇక్కడ కనిపిస్తోంది. వారి విచ్చలవిడి, విశృంఖలత్వాన్ని నేనే కాదు.. సమాజం కూడా చూస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో ప్రస్తుతం ఇదే జరుగుతోంది’ కేసీఆర్ రేవంత్ రెడ్డ సర్కార్ పై సెటైర్లు వేశారు.

 

కేసీఆర్ ఇంకా ఏమన్నారో ఈ కింది లైవ్ వీడియోలో చూడండి..

 

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

 

Published on: Apr 23, 2024 08:22 PM