నిలిచిపోయిన రిజిస్ట్రేషన్లు.. రోడ్డెక్కుతున్న భూ బాధితులు
కరీంనగర్ శివారు రేకుర్తిలో 40 ఏళ్లుగా సాగులో ఉన్న 536 ఎకరాల భూములను అధికారులు ప్రభుత్వ భూమిగా ప్రకటించారు. దీంతో మూడు నెలల నుండి రిజిస్ట్రేషన్లు నిలిచిపోయాయి. అనేక చేతులు మారిన ఈ భూముల్లో ఇళ్లు నిర్మించుకున్న, ప్లాట్లు కొన్న వేల మంది యజమానులు ఆందోళన చెందుతున్నారు. గతంలో హైకోర్టు తీర్పు ఉన్నా, ప్రస్తుత కలెక్టర్ ఉత్తర్వులతో బాధితులు న్యాయం కోసం రోడ్డెక్కారు.
నలబై ఏండ్లుగా సాగు చేసుకుంటున్న భూములు అవి. ఈ మధ్య కాలంలో క్రయ విక్రయాలు ఎన్నో జరిగాయి. సడెన్‌గా అది ప్రభుత్వ భూమి అంటూ అధికారులు బాంబు లాంటి వార్త పేల్చారు. అంతే కాదు.. సుమారుగా 536 ఎకరాల్లో రిజిస్ట్రేషన్లు నిలిపివేశారు. దీంతో భూ యజమానులు లబోదిబోమంటూ న్యాయం కోసం రోడ్డెక్కారు. కరీంనగర్ శివారులోని రేకుర్తిలోనిదీ సంఘటన. కరీంనగర్ శివారులోని రేకుర్తి.. కరీంనగర్ కార్పొరేషన్లో విలీనం చేశారు. సిటీలో కలవడంతో వ్యవసాయ భూముల ధరలకు రెక్కలొచ్చాయి. క్రమంగా లేఅవుట్లు వెలిశాలయి. అయితే ఇక్కడ చాలా మంది పేద, మధ్య తరగతి ప్రజలు ఇళ్ల స్థలాల కోసం భూములు కొనుగోలు చేశారు. 40 యేళ్లుగా అనేక చేతులు మారాయి.. మూడు నెలల నుంచీ.. సుమారుగా 536 ఎకరాల భూములను నిషేదిత జాబితాలో చేర్చారు.. ఇవన్నీ ప్రభుత్వానికి అనుబంధ భూములుగా చెబుతున్నారు. ఇక్కడ చాలా మంది ఇళ్లను నిర్మించుకున్నారు.. అవసరాల కోసం ప్లాట్లను కొనుగోలు చేశారు. ఇప్పుడు.. సడెన్‌గా.. రిజిస్ట్రేషన్లను నిలిపివేయడంతో.. బాధితులు ఆందోళన చెందుతున్నారు. రేకుర్తిలో మూడు వేలకు పైగా ఇళ్లు ఉన్నాయి.. మరో రెండు వేల వరకు ఇళ్ల ప్లాట్లు ఉన్నాయి.. ఇప్పుడు. ఇవన్నీ నిషేదిత జాబితాలో చేర్చారు. గతంలో ఇలాంటి సమస్య వస్తే హైకోర్టును ఆశ్రయించారు. హై కోర్టు స్టే ఇవ్వడంతో క్రయ, విక్రయాలు జరిగాయి. తాజాగా ఈ భూముల రిజిస్ట్రేషన్లు చేయకూడదని కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో తమ సమస్యను పరిష్కరించాలని బాధితులు కోరుతున్నారు. ఒక్క రేకుర్తే కాదు. కరీంనగర్ కార్పొరేషన్లో విలీనమైన అలుగునూర్ ఇంటి నెంబర్తో ఉన్న వాటి రిజిస్ట్రేషన్లు నిలిపివేశారు. చాలా యేళ్లుగా ఇక్కడ ఇంటి నెంబర్ ఆధారంగానే రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి. ఇప్పుడు రిజిస్ట్రేషన్లు నిలిపివేయడంతో బాధితులు ఆందోళన చెందుతున్నారు. ఆడపిల్ల పెళ్లిళ్లతో పాటు, ఇతర శుభ కార్యక్రమాలు.. పిల్లల చదువులపై ప్రభావం చూపుతుందని అంటున్నారు. ఈ సమస్యను పరిష్కరించకపోతే ఆత్మహత్యలే శరణ్యమని ఆవేదన చెందుతున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ప్రధాని వెళ్లగానే పూల కుండీలపై పడ్డ జనం
టీని రెండోసారి వేడి చేసి తాగుతున్నారా ?? మీ బాడీ షెడ్డుకే
విద్యుత్ స్తంభం ఎక్కిన ఎమ్మెల్యే.. కారణం ఏంటో తెలిస్తే షాక్ అవుతారు
Samantha: ఈ ఏడాదిని నా జీవితంలో మర్చిపోను
Gmail: గుడ్ న్యూస్.. మీ మెయిల్ ఐడీని మార్చుకోవచ్చు.. ఈ విధంగా
