మేడ్చల్‌లోని జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో రోడ్డు ప్రమాదం జరిగింది. యూటర్న్ తీసుకుంటున్న ఆర్టీసీ బస్సును.. వేగంగా దూసుకొచ్చిన బైక్ ఢీ కొట్టింది. బైక్‌పై ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులు శివ(19), భాను(22)ఈ ప్రమాదంలో గాయపడ్డారు. ప్రమాదం గురించి తెలిసిన వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. గాయపడిన ఇద్దరిని.. వెంటనే ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆ ఇద్దరు క్షేమంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. పోలీసులు అప్రమత్తత కారణంగా ఇద్దరు సురక్షితంగా బయటపడ్డారు. ఈ ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి.