కోతుల బెడదకు చెక్.. బామ్మగారి ఐడియా అదిరిందిగా!
జగిత్యాల జిల్లాలో మల్యాల ఎక్స్ రోడ్ వద్ద పండ్లు అమ్ముకునే వృద్ధురాలు కోతుల బెడదకు వినూత్న పరిష్కారం కనుగొన్నారు. కోతులు పండ్లను ఎత్తుకెళ్లడంతో తీవ్రంగా నష్టపోతున్న ఆమె, తన వ్యాపార స్థలం చుట్టూ ఇనుప జాలిని ఏర్పాటు చేసుకున్నారు. దాని లోపల కూర్చుని పండ్లు అమ్మడం ప్రారంభించారు. జాలి అడ్డుగా ఉండటంతో కోతుల నుంచి పండ్లను కాపాడుకోగలుగుతున్నారు. ఆమె తెలివైన ఆలోచన స్థానికుల ప్రశంసలు అందుకుంటోంది.
జగిత్యాల జిల్లాలో ఓ వృద్ధురాలు రోడ్డు పక్కన చెట్టుకింద పండ్లు అమ్ముకుంటూ జీవనం సాగిస్తోంది. అయితే ఆ ప్రాంతంలో కోతుల బెడద ఎక్కువైపోయింది. పండ్లు ఎత్తుకెళ్లిపోతూ ఆ వృద్ధురాలిని కోతులు ముప్పుతిప్పలు పెడుతున్నాయి. మల్యాల ఎక్స్ రోడ్ ప్రధాన రహదారి పక్కన ఆమె పండ్లు విక్రయిస్తుండగా.. ఎటు చూసినా గుంపులు గుంపులుగా వచ్చే కోతులు క్షణాల్లో దాడి చేసి పండ్లను ఎత్తుకెళ్తుండేవి. తాను తెచ్చిన పండ్లలో దాదాపు సగం వరకు కోతుల పాలవుతుండటంతో ఆమె తీవ్రంగా నష్టపోయింది. పొద్దంతా కష్టపడి కూర్చున్నా కనీసం కూలి కూడా గిట్టుబాటు కాని పరిస్థితి ఏర్పడింది. మరోవైపుప కుటుంబ పోషణ కోసం వ్యాపారం చేయక తప్పని పరిస్థితి, ఈ క్రమంలో కోతుల బాధ భరించలేక ఆమె సతమతమైంది. ఈ సమస్యకు ఎలాగైనా చెక్ పెట్టాలనుకున్న ఆమెకు ఓ ఐడియా వచ్చింది. తాను కూర్చుని పండ్లు అమ్ముకునే స్థలం చుట్టూ ఇనుప జాలిని ఏర్పాటు చేసుకుంది. ఆ జాలి గూటిలోపల కూర్చని పండ్లను అమ్ముకోవడం మొదలుపెట్టింది. ఎవరైనా కస్టమర్లు వస్తేనే జాలిని కొద్దిగా పక్కకు జరిపి పండ్లు విక్రయిస్తోంది. ఈ ప్రయోగం ఆమెకు ఎంతో ఊరటనిచ్చింది. జాలి అడ్డుగా ఉండటంతో కోతులు అటువైపు రావడానికి భయపడుతున్నాయి. ఒకవేళ వచ్చినా పండ్లను ఎత్తుకుపోయే అవకాశం లేకుండా పోయింది. వృద్ధురాలి ఐడియాకు అందరూ ఫిదా అవుతున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
అత్తారింటికి దారేది? అయ్యో.. ఈ నవ వధువుకి ఎంత కష్టం వచ్చింది!
పెట్రోలును మంచినీళ్లలా తాగేసిన యువకుడు!
కేవలం 7 రూపాయలు.. ఆమె జీవితాన్నే మార్చేశాయి!
కోతుల బెడదకు చెక్.. బామ్మగారి ఐడియా అదిరిందిగా!
అత్తారింటికి దారేది? అయ్యో.. ఈ నవ వధువుకి ఎంత కష్టం వచ్చింది!
పెట్రోలును మంచినీళ్లలా తాగేసిన యువకుడు!
కేవలం 7 రూపాయలు.. ఆమె జీవితాన్నే మార్చేశాయి!
కార్లు, బస్సులే కాదు ఇకపై రైళ్లు కూడా ఆన్‌లైన్‌లో అద్దెకు!
రూపాయి కాయిన్స్‌తో మహిళ నామినేషన్.. ఊరంతా తలో రూపాయి చందా
దిండుకింద చేయి పెట్టిన యువతి.. చేతికి తగిలింది చూసి షాక్!

