రాత్రిపూట స్నానం చేస్తున్నారా.. ఏమవుతుందో తెలుసా ??

Updated on: May 13, 2025 | 6:12 PM

వేసవికాలం వచ్చేసింది. ఇప్పటివరకూ స్నానం చేయాలంటే బద్దకించేవాళ్లు కూడా మూడు పూటలా స్నానం చేయడానికి కూడా వెనుకాడరు. ఉదయాన్నే స్నానం చేసి ఆఫీసులకు వెళ్లినవాళ్లు రోజంతా వివిధ పనులతో బిజీగా గడుపుతారు. సాయంత్రం ఇంటికి రాగానే స్నానం చేసి రిలాక్స్‌ ఫీలవుతారు. నిజానికి సాయంత్రం వేళ చేసే స్నానం శరీరానికి హాయినిస్తుంది..మనసుకి ఎంతో ప్రశాంతతను కలిగిస్తుంది.

మరి రాత్రివేళ ఇలా స్నానం చేయడం మంచిదేనా? రాత్రిపూట తల స్నానం చేయవచ్చా? చేస్తే ఎలాంటి ప్రభావం ఉంటుంది అనే విషయాలు తెలుసుకుందాం. వేసవి కాలంలో చాలా మంది అధిక చెమటతో ఇబ్బంది పడుతుంటారు. అలాంటివారు రోజులో మూడునాలుగుసార్లు స్నానం చేస్తారు. ఇలా చేయడం వల్ల శరీరంనుంచి చెమటవాసన రాకుండా ఉంటుంది. రాత్రి పడుకునే ముందు స్నానం చేస్తే శరీరంలో అనేక మార్పులు వస్తాయి. అలసట దూరమవుతుంది, ఒత్తిడి తగ్గుంది. మనసు, శరీరం విశ్రాంతి కలిగి హాయిగా అనిపిస్తుంది. దీంతో రాత్రి మంచి నిద్రపడుతుంది. అంతేకాగు, పడుకునే ముందు స్నానం చేసి నిద్రపోవడం వల్ల రోగనిరోధక శక్తి మెరుగుపడుతుందట. శరీరం ఇన్‌ఫెక్షన్లబారిన పడకుండా ఉంటుందట. రక్త ప్రసరణ మెరుగుపడటమే కాకుండా గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదం కూడా తగ్గుతుందట. వేసవిలో చెమట కారణంగా చర్మ సంబంధిత సమస్యలు వస్తాయి. అందుకే రాత్రిపూట తప్పక స్నానం చేసి నిద్రపోవాలంటున్నారు. ఇది చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది.అయితే రాత్రి భోజనం చేసిన తర్వాత తలస్నానం చేయకూడదని చాలామంది అభిప్రాయపడుతుంటారు. దీనివల్ల రోగనిరోధక శక్తి బలహీనంగా ఉన్నవారు త్వరగా ఇన్‌ఫెక్షన్లబారిన పడే అవకాశం ఉందట. అంతేకాదు, భోజనం తర్వాత స్నానం చేస్తే జీర్ణసమస్యలు కూడా తలెత్తుతాయని నిపుణుల మాట.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

సింహాల గుంపులోకి ఏనుగు ఎంట్రీ.. చివరిలో సూపర్‌ ట్విస్ట్‌

ఈ డైట్‌ ఫాలో అయితే.. మీ కిడ్నీలకు ఢోకా ఉండదు

ఈ జ్యూస్‌ రోజుకి ఒక్క గ్లాస్‌ తాగండి.. ఫలితం మీరే చూడండి

తల్లీ, కూతుళ్ల ప్రాణం తీసిన ఎయిర్‌ కూలర్‌