ఉల్లి, వెల్లుల్లిని కలిపి తింటే ఏం జరుగుతుందో తెలుసా?

Updated on: Mar 10, 2025 | 8:42 PM

సాధారణంగా ప్రతి కూరలోనూ ఉల్లి, వెల్లుల్లి కామన్‌గా వాడుతుంటారు చాలామంది. వెల్లుల్లి గుండె ఆరోగ్యానికి మంచిదని చెబుతారు. ఇక ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదనే నానుడి ఉండనే ఉంది. ఈ క్రమంలో ఈ రెండిటినీ కలిపి వాడటం మంచిదేనా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపధ్యంలో నిపుణులు ఏం చెబుతున్నారో చూద్దాం.

ఉల్లి, వెల్లుల్లి రెండిట్లోనూ యాంటి ఫంగల్‌, యాంటి బ్యాక్టీరియల్‌, యాంటి వైరల్‌ గుణాలు ఉంటాయి. ఇవి శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతాయి. కాబట్టి, ఉల్లి, వెల్లుల్లిని కలిపి తీసుకోవడం మంచిదే అంటున్నారు నిపుణులు. అధిక రక్తపోటుతో బాధపడేవారు ఉల్లి, వెల్లుల్లిని కలిపి తింటే మంచి ఫలితం ఉంటుందంటున్నారు. అలా తినడం వల్ల కొంతకాలానికి ఈ సమస్య నుంచి విముక్తి లభించే అవకాశం ఉందంటున్నారు. అంతేకాదు, మైగ్రెయిన్‌ తో బాధపడుతున్న వారికి ఈ రెండు మంచి ఔషధాలుగా పనిచేస్తాయట. శరీరంలో కొలెస్ట్రాల్‌ స్థాయులు పెరిగినప్పుడు కూడా ఉల్లి, వెల్లుల్లి కలిపి తింటే మంచి ఫలితం ఉంటుందట. ఇవి కొలెస్ట్రాల్‌ను అదుపులో ఉంచుడమే కాకుండా.. శరీరంలో కొవ్వు పేరుకోకుండా అడ్డుకుంటాయట. ఉల్లి, వెల్లుల్లిలో విటమిన్‌ బి, సి, పొటాషియం పుష్కలంగా ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలుచేస్తాయంటున్నారు. ఈ సమాచారం మీ అవగాహన కోసం మాత్రమే.. ఏదైనా ఆరోగ్య సమస్య ఉంటే వైద్యులను సంప్రదించాలి.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

‘హీరోలను పొగడడానికే హీరోయిన్లు’ సౌత్ సినిమాలపై జ్యోతిక సంచలన కామెంట్స్

స్మగ్లింగ్‌తో నెలకు రూ.3 కోట్ల ఆదాయం! ఈమె హీరోయిన్ కాదు.. జగత్‌ కిలాడీ

Chiranjeevi: చెల్లెలి మరణాన్ని తలుకుచుని.. ఎమోషనల్ అయిన చిరు

బ్యాంకు ఖాతాదారులకు హెచ్చరిక.. ఈ పని చేయకుంటే మీ అకౌంట్‌ బ్లాక్‌