బుల్లెట్‌ రైలు ప్రాజెక్ట్‌పై బిగ్‌ అప్డేట్‌..! వీడియో రిలీజ్‌ చేసిన అశ్విని వైష్ణవ్

Updated on: Jan 22, 2026 | 5:38 PM

భారతదేశ మొట్టమొదటి బుల్లెట్ రైలు 2027 ఆగస్టు 15న ముంబై-అహ్మదాబాద్ మధ్య పట్టాలెక్కనుంది. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ భారతీయ రైల్వే చరిత్రలో సువర్ణాధ్యాయంగా నిలవనుంది. 508 కి.మీ.ల దూరాన్ని 320 కి.మీ/గం వేగంతో కేవలం 2 గంటల్లో చేరనుంది. ఇది 'మేక్ ఇన్ ఇండియా' చొరవ కింద దేశీయ తయారీ సామర్థ్యాలను బలోపేతం చేస్తుంది. రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ఈ కీలక ప్రకటన చేశారు.

భారతీయ రైల్వే చరిత్రలోనే ఒక సువర్ణ అధ్యాయానికి ముహూర్తం ఖరారైంది. దేశ ప్రజలకు అత్యంత వేగవంతమైన, విలాసవంతమైన ప్రయాణ అనుభూతిని అందించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఇండియాలో మొట్టమొదటి బుల్లెట్ రైలు 2027, ఆగస్టు 15న అంటే మన 81వ స్వాతంత్య్ర దినోత్సవం నాడు పట్టాలెక్కనుంది. ప్రతిష్టాత్మక బుల్లెట్‌ రైలు ప్రాజెక్ట్‌పై రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ కీలక ప్రకటన చేశారు.భారత్‌లో మొట్టమొదటి బుల్లెట్‌ రైలు ప్రాజెక్టును ముంబై – అహ్మదాబాద్ మధ్య చేపట్టింది. ఈ ప్రాజెక్టులో ఓవర్ హెడ్ ఎలక్ట్రిఫికేషన్ మాస్ట్‌ల ఏర్పాటు స్థిరమైన పురోగతి సాధిస్తోందని అశ్విని వైష్ణవ్ తెలిపారు. ఈ అభివృద్ధి భారతదేశపు మొట్టమొదటి హై-స్పీడ్ రైలు వ్యవస్థకు విద్యుత్ ట్రాక్షన్‌ను ప్రారంభించే దిశగా ఒక ముఖ్యమైన అడుగుగా అభివర్ణించారు. ‘మేక్ ఇన్ ఇండియా’ చొరవ కింద స్థిరమైన ఆన్-గ్రౌండ్ అమలును ప్రతిబింబిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా నిరూపితమైన హై-స్పీడ్ రైలు సాంకేతికతను అవలంబిస్తూ దేశీయ తయారీ సామర్థ్యాలను బలోపేతం చేస్తుందని కేంద్ర మంత్రి అన్నారు. ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి జరుగుతున్న పనులు చూపించేలా ఒక వీడియోను కూడా అశ్విని వైష్ణవ్ సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు. ఈ హై-స్పీడ్ రైల్ కారిడార్ మొత్తం పొడవు 508 కిలోమీటర్లు. ప్రస్తుతం ఈ రెండు నగరాల మధ్య ప్రయాణానికి రైలులో 6 నుండి 8 గంటల సమయం పడుతోంది. కానీ, బుల్లెట్ రైలు గంటకు గరిష్ఠంగా 320 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్తుంది. దీనివల్ల ప్రయాణ సమయం కేవలం 2 గంటలకు తగ్గిపోనుంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

అక్కడ నాగరాజు దర్శనం.. అద్భుతాలు తథ్యం అంటున్న భక్తులు

సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌పై ఇద్దరు భార్యలు ఫిర్యాదు.. విషయం తెలిసి పోలీసులు షాక్‌

Pooja Hegde: మాస్ పల్స్ తెలిసిందన్న పూజాహెగ్డే.. ఇక దుమ్ము దుమారమే

గ్లామర్ డోస్ పెంచిన ప్రియా ప్రకాష్ వారియర్.. ఫ్యాన్స్ కోసం తప్పదు బాస్ అంటున్న ముద్దుగుమ్మ

Aamir Khan: డ్రీమ్ ప్రాజెక్ట్ మహాభారతంపై ఆమిర్ ఖాన్ కామెంట్‌.. అబ్బా ఊపిరి పీల్చుకున్న ఫ్యాన్స్