క్యాష్ ఆన్ డెలివరీకి అదనపు ఛార్జీలు ఎందుకు? కేంద్రం సీరియస్ వీడియో
ఈ-కామర్స్ రంగంలో క్యాష్ ఆన్ డెలివరీకి వసూలు చేస్తున్న అదనపు ఛార్జీలు చట్టవిరుద్ధమని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి స్పష్టం చేశారు. ఇవి వినియోగదారులను దోపిడీ చేసే "డార్క్ ప్యాటర్న్‌లు" అని పేర్కొన్నారు. కస్టమర్లను మోసం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పారదర్శక వ్యాపార పద్ధతులను కాపాడడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు.
ఈ-కామర్స్ రంగం వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో, ఆన్‌లైన్‌లో వస్తువులు బుక్ చేసుకునే వినియోగదారుల నుంచి క్యాష్ ఆన్ డెలివరీ (COD) కోసం ఎక్కువ ఛార్జీలు వసూలు చేస్తున్నారని గుర్తించారు. దీనిపై కేంద్ర వినియోగదారుల వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి తీవ్రంగా స్పందించారు. ఈ-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌లు కస్టమర్లను మోసం చేసి అదనపు ఛార్జీలు వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.
మరిన్ని వీడియోల కోసం :
