భారత్‌పై లానినా ఎఫెక్ట్.. ఉష్ణోగ్రతలు 10 డిగ్రీలకు పడిపోయే ఛాన్స్
భారత వాతావరణ శాఖ దేశవ్యాప్తంగా తీవ్ర చలి గురించి హెచ్చరించింది. లా నినా ప్రభావంతో రాబోయే రోజుల్లో ఉష్ణోగ్రతలు గణనీయంగా తగ్గుతాయి. కొండ ప్రాంతాల్లో హిమపాతం, మైదానాల్లో చలిగాలులు ఉండనున్నాయి. రాజస్థాన్ వంటి రాష్ట్రాల్లో ఇప్పటికే ఉష్ణోగ్రతలు పడిపోయాయి. ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని, రైతులు, ప్రయాణికులు అప్రమత్తంగా ఉండాలని IMD సూచించింది.
దేశంలోని అన్ని రాష్ట్రాలకు భారత వాతవారణ శాఖ కీలక హెచ్చరికలు జారీ చేసింది. దేశంలో ఈ సారి లానినా ఎఫెక్ట్ తీవ్రంగా ఉండబోతుందని అంచనా వేసింది వాతావరణశాఖ. దీని ప్రభావంతో రాబోయే రోజుల్లో అనేక రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు తగ్గనున్నాయని.. దానితో పాటు తీవ్రమైన చలి వాతావారణం ఉండనున్నట్టు వాతవారణ శాఖ పేర్కొంది. జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ వంటి కొండ ప్రాంతాలలో హిమపాతం కురుస్తుందని.. రాజస్థాన్, మధ్యప్రదేశ్, హర్యానా, పంజాబ్, ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రాలు శీతాకాలపు చలి తీవ్రంగా ఉండనుంది తెలిపింది. రాజస్థాన్‌లోని 12 జిల్లాల్లో ఇప్పటికే 10 డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువకు ఉష్ణోగ్రత పడిపోయింది. వర్షాలు, హిమపాతం, చల్లని గాలులు కురిసే అవకాశం ఉన్నందున, అనేక రాష్ట్రాల్లో రాత్రి ఉష్ణోగ్రతలు గణనీయంగా తగ్గుతాయని భారత వాతావరణ శాఖ పేర్కొంది. ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ వంటి కొండ ప్రాంతాలలో మోస్తరు వర్షాలు, హిమపాతం కురిపించే అవకాశం ఉంది. పర్వతాలలో హిమపాతం తర్వాత మైదానాలలో చల్లటి గాలులు వీస్తాయి. దీని వలన రాత్రి ఉష్ణోగ్రతలు తగ్గుతాయని వాతావరణ వాఖ పేర్కొంది.ముఖ్యంగా రైతులు, ఉదయం ప్రయాణించే వారు జాగ్రత్తగా ఉండాలని IMD సూచించింది. రాజస్థాన్‌లోని కొండ ప్రాంతం – సికార్ – రాష్ట్రంలో అత్యల్ప ఉష్ణోగ్రత 7 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. అల్వార్, ఝుంఝును, ఉదయపూర్ వంటి నగరాల్లో ఈ సీజన్‌లో రాత్రి వేళ అత్యంత చలి వాతావరణం నమోదైనట్టు పేర్కొంది. పసిఫిక్ మహాసముద్రంలో జరిగే వాతావరణ మార్పును లానినా అంటారు. ఇది ప్రపంచ వాతావరణంలో మార్పులకు దారితీస్తుంది. ప్రతి మూడు నుంచి ఐదేళ్ల మధ్య ఒకసారి లానినా ఏర్పుడుతంది. కొన్ని సమయాల్లో వరుస సంవత్సరాల్లో కూడా వచ్చే అవకాశం ఉంది. లా నినాతో తూర్పు పసిఫిక్‌లోని నీటిని సాధారణం కంటే మరింత చల్లగా మారుతుంది. లానినాతో రుతుపవనాలపై ప్రభావం చూపే అవకాశం ఉంది. మరోవైపు కరువు పరిస్థితులకు లానినా కారణమయ్యే అవకాశం ఉందని చెబుతారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
యాదాద్రీశుడికి భారీ ఆదాయం.. ఒక్కరోజు హుండీ ఆదాయం ఎంతో తెలుసా?
ముగింపు దిశగా అమెరికా షట్‌డౌన్.. ఊపిరి పీల్చుకున్న అమెరికన్లు
వరుస తుఫాన్‌లతో ఫిలిప్పీన్స్ అతలాకుతలం
స్పైస్‌జెట్ విమానానికి తప్పిన పెను ప్రమాదం.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్ తెరవగానే
కోటి రూపాయల ఫ్యాన్సీ నెంబర్ వేలంలో బిగ్ ట్విస్ట్
కిడ్నీ ఇచ్చి.. ప్రాణం పోసిన తండ్రి
కొడుకు కోసం భార్యాభర్తల మధ్య పంచాయితీ.. కట్ చేస్తే..
ప్రియుడి మృతదేహాన్ని పెళ్లి చేసుకుని.. కన్నీళ్లు పెట్టిన యువతి

