IBomma Ravi Arrest: ఐబొమ్మ రవి అరెస్ట్.. మెగాస్టార్ చిరంజీవితో కలిసి సీపీ సజ్జనార్ సంచలన ప్రెస్‌మీట్

Updated on: Nov 17, 2025 | 11:38 AM

పైరసీ వ్యవహారంలో రవికి ఎవరెవరు సహకరించారు..? ఇప్పటి వరకు ఎంత సంపాదించాడు..? ఇంకా ఎక్కడెక్కడ దాచాడనే కోణంలో దర్యాప్తు చేయబోతున్నారు సైబర్ క్రైమ్ పోలీసులు.. అయితే.. ఐబొమ్మ రవి అరెస్ట్ అనంతరం.. సినీ ప్రముఖులతో కలిసి హైదరాబాద్ సీపీ సజ్జనార్ కీలక ప్రెస్‌మీట్ నిర్వహించారు. ఈ సమావేశానికి మెగాస్టార్ చిరంజీవి, నాగార్జున, దిల్ రాజు, రాజమౌళి హాజరయ్యారు.

పైరసీ వెబ్‌సైట్ ఐబొమ్మకు హోల్ అండ్ సోల్ ఓనర్ ఇమంది రవి.. ఇప్పుడు పోలీసుల చెరలో చిక్కాడు. అక్టోబర్ 1 నుంచి అతడి కదలికలపై నిఘా పెట్టి శనివారం ఉదయం కూకట్‌పల్లిలోని రెయిన్‌బో విస్టా అపార్ట్‌మెంట్‌లో అరెస్ట్ చేసి, మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిస్తే, 14 రోజుల రిమాండ్‌ విధించారు. 7 రోజుల కస్టడీని కోరి, పైరసీ వ్యవహారంలో రవికి ఎవరెవరు సహకరించారు..? ఇప్పటి వరకు ఎంత సంపాదించాడు..? ఇంకా ఎక్కడెక్కడ దాచాడనే కోణంలో దర్యాప్తు చేయబోతున్నారు సైబర్ క్రైమ్ పోలీసులు.. అయితే.. ఐబొమ్మ రవి అరెస్ట్ అనంతరం.. సినీ ప్రముఖులతో కలిసి హైదరాబాద్ సీపీ సజ్జనార్ కీలక ప్రెస్‌మీట్ నిర్వహించారు. ఈ సమావేశానికి మెగాస్టార్ చిరంజీవి, నాగార్జున, దిల్ రాజు, రాజమౌళి హాజరయ్యారు.

ఇమంది రవి ఇంట్లో హార్డ్ డిస్క్‌లు, సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకుని, బ్యాంకుల ఖాతాలో ఉన్న 3 కోట్ల నగదును కూడా సీజ్ చేశారు. డిలీటైన ఫైళ్లు కూడా రికవరీ చేశారు. 2018 నుంచి రెయిన్‌బో విస్టా నుంచే విదేశాలకు IPలు బదిలీ ఐనట్టు, యూకేలో కూడా టీమ్ నడిపినట్లు తేల్చారు. ఏడేళ్ల కిందట కూకట్‌పల్లిలో ఫ్లాట్ కొని ఉనికి బయట పడకుండా జాగ్రత్తపడ్డ రవి.. ఇప్పుడు కోర్టు కేసు విచారణ కోసం వచ్చి దొరికిపోయాడు. ఇన్నాళ్లూ తమ మధ్యనే ఉన్నది సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ కాదని, ఇంటర్నేషనల్ కేటుగాడని తెలిసి ఇరుగూపొరుగు ఆశ్చర్యపోతున్నారు.

Published on: Nov 17, 2025 11:36 AM