హైదరాబాద్‌లోని ఆ ఏరియాల్లో హైడ్రా కమిషనర్ రంగానాథ్ పర్యటన! స్థానికుల గుండెల్లో గుబులు..
హైదరాబాద్ కమిషనర్ ఏవీ రంగనాథ్ పలు ప్రాంతాల్లోని నాలాలను పరిశీలించారు. నాలాల్లో పేరుకుపోయిన చెత్తను తొలగించాలని, ఆక్రమణలను తొలగించాలని ఆయన అధికారులను ఆదేశించారు. బుల్కాపూర్ నాలా విస్తరణ పనులను కూడా పరిశీలించారు. స్థానికుల భయాలను పక్కన పెట్టి, నాలా శుభ్రతపైనే దృష్టి పెట్టారని అధికారులు తెలిపారు.
హైడ్రా కమిషనర్ రంగనాథ్ హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో పర్యటించారు. దీంతో ఆయా ఏరియాల్లోని స్థానికుల్లో భయందోళనలు వ్యక్తం అవుతున్నాయి. ఇక్కడేమన్న కూల్చివేతలు ప్లాన్ చేస్తున్నారా? అని స్థానికులు మాట్లాడుకుంటున్నారు. కానీ, ఆయన పర్యటించింది.. అక్కడుంటే నాలాలను పరిశీలించేందుకు మాత్రమే. నాలాల్లో పేరుకుపోయిన చెత్తను వెంటనే తొలగించాలని సంబంధిత అధికారులను హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ ఆదేశించారు. నాలాల్లో ఎక్కడా ఆటంకాలు లేకుండా చూడాలన్నారు. నాలాలపై ఆక్రమణలుంటే వెంటనే తొలగించాలన్నారు. చింతల్‌బస్తీ మీదుగా సాగే బుల్కాపూర్ నాలా విస్తరణ పనులను కమిషనర్ పరిశీలించారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Published on: Jun 13, 2025 08:16 PM
వైరల్ వీడియోలు
పొదుపు చేయలేదు.. జాబ్ పోయింది.. టెకీ ఆవేదన
ప్రాణాలకు తెగించి వృద్ధ దంపతుల వీరోచిత పోరాటం
మెస్సికి కాస్ట్లీ గిఫ్ట్ ఇచ్చిన అనంత్ అంబానీ..
నీరు తోడుతుండగా వచ్చింది చూసి.. పరుగో పరుగు..
జోరు వానలో చిక్కుకున్న ఏనుగు.. గొడుగుగా మారిన తల్లి ఏనుగు..
6 నెలలు చికెన్ మాత్రమే తిన్న యువతి.. చివరకు ఆస్పత్రిలో చేరి..
తవ్వకాల్లో బయటపడ్డ దుర్గమాత విగ్రహం

