Hyderabad Metro: గాలొచ్చినా.. వానొచ్చినా.. మెట్రో ఆగదు.! ప్రయాణికులకు నిరంతర సేవలు..

|

Jun 15, 2024 | 5:05 PM

వానాకాలం వచ్చేసింది. ఈ సమయంలో ప్రయాణాలు కాస్త కష్టమే.. ముఖ్యంగా నగరంలో వర్షం పడిందంటే రోడ్లు చెరువులను తలపిస్తాయి. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడతారు. ఈ క్రమంలో చాలామంది మెట్రోను ఆశ్రయిస్తుంటారు. ఈ క్రమంలో వానాకాలంలో మెట్రోరైలు కార్యకలాపాలకు అంతరాయాలు తలెత్తకుండా నిరంతరంగా సేవలు అందించడంపై ఎల్‌ అండ్‌ టీ హైదరాబాద్‌ మెట్రో రైలు

వానాకాలం వచ్చేసింది. ఈ సమయంలో ప్రయాణాలు కాస్త కష్టమే.. ముఖ్యంగా నగరంలో వర్షం పడిందంటే రోడ్లు చెరువులను తలపిస్తాయి. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడతారు. ఈ క్రమంలో చాలామంది మెట్రోను ఆశ్రయిస్తుంటారు. ఈ క్రమంలో వానాకాలంలో మెట్రోరైలు కార్యకలాపాలకు అంతరాయాలు తలెత్తకుండా నిరంతరంగా సేవలు అందించడంపై ఎల్‌ అండ్‌ టీ హైదరాబాద్‌ మెట్రో రైలు ఆపరేషన్స్‌ అండ్‌ మెయింటనెన్స్‌ కంపెనీ కియోలిస్, స్వతంత్ర ఇంజినీర్‌ ఏఈకామ్‌ సీనియర్‌ అధికారులతో మెట్రో రైలు ఎండీ ఎన్‌.వి.ఎస్‌.రెడ్డి బేగంపేటలోని మెట్రోరైలు భవన్‌లో గురువారం సమీక్ష సమావేశం నిర్వహించారు.

భారీ వర్షాలు, ఈదురుగాలులకు రైలు సేవలకు అంతరాయం కలగకుండా చూడాలని సూచించారు. ట్రాన్స్‌కో ఫీడర్‌ ట్రిప్‌ అయితే తక్షణమే ప్రత్యామ్నాయ ఫీడర్‌లకు మార్చడానికి ఏర్పాట్లు చేయాలి. జాయింట్లను తనిఖీ చేయడం, సీల్‌ వేయడం, వర్షపునీటి పైపులను ఎప్పటికప్పుడు శుభ్రం చేయడం, లీకులను నివారించడం, వయాడక్ట్‌లపై పెరిగిన మొక్కలను తొలగించాలి. విద్యుత్తు ట్రాక్షన్‌ లైన్లపై పడే వస్తువులను తొలగించాలి. మెట్రో రైలు వ్యవస్థలపై పడే సమీపంలోని ప్రకటనల బోర్డుల ఫ్లెక్సీలను తొలగించాలి. మెట్రో ప్రవేశ మార్గాలు, లిఫ్ట్‌లు, ఎస్కలేటర్ల వద్ద ముంపు లేకుండా చూడాలి. ఇటీవల ఢిల్లీ మెట్రో రైలులో ఒక మహిళ తన చీర రైలు తలుపుల మధ్య ఇరుక్కుపోయి అమె మరణానికి దారితీసిందని తెలిపారు. తలుపుల వద్ద రద్దీని నివారించాలని సూచించారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.

Follow us on