ఓరీ దేవుడో..వరదలో మునిగిపోయిన MGBS.. మూసీ ఎఫెక్ట్‌తో ఆగమాగం వీడియో
హైదరాబాద్‌ను భారీ వర్షాలు ముంచెత్తడంతో మూసీనది ఉగ్రరూపం దాల్చి ఎంజీబీఎస్ బస్టాండ్‌ను ముంచెత్తింది. వందలాది మంది ప్రయాణికులు చిక్కుకుపోయారు. సీఎం రేవంత్ రెడ్డి పరిస్థితిని సమీక్షించి సహాయక చర్యలకు ఆదేశించారు. ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ప్రయాణికులను ఎంజీబీఎస్‌కు రావద్దని సూచించారు. చాదర్‌ఘాట్ ప్రాంతంలో ఇళ్లు కూడా నీట మునిగాయి.
హైదరాబాద్ మహానగరాన్ని శుక్రవారం రాత్రి భారీ వర్షాలు అతలాకుతలం చేశాయి. కుండపోత వానకు నగరం అస్తవ్యస్తంగా మారింది. జంట జలాశయాల గేట్లు ఎత్తడంతో మూసీనది ఉగ్రరూపం దాల్చి, మహాత్మా గాంధీ బస్ స్టేషన్ (ఎంజీబీఎస్) ప్రాంగణాన్ని పూర్తిగా ముంచెత్తింది. వందలాది మంది ప్రయాణికులు, ముఖ్యంగా మహిళలు, పిల్లలు గంటల తరబడి బస్టాండ్‌లోనే చిక్కుకుపోయి తీవ్ర భయాందోళనలకు, ఇబ్బందులకు గురయ్యారు. మూసీ ప్రవాహం అర్ధరాత్రి తర్వాత ఒక్కసారిగా పెరిగి, గండిపేట నుంచి నాగోల్ వరకు నది ప్రమాదకర స్థాయిలో ప్రవహించింది. ఈ ఘటనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తక్షణమే స్పందించారు. అర్ధరాత్రి సమయంలోనే ఉన్నత అధికారులతో సమీక్ష నిర్వహించి, బస్టాండ్‌లో చిక్కుకున్న ప్రయాణికులను సురక్షితంగా బయటకు తీసుకురావాలని పోలీసు, జీహెచ్‌ఎంసీ, జలమండలి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
మరిన్ని వీడియోల కోసం :
టచ్ చేస్తావా.. రూ.2 కోట్లు ఇస్తావా?..భర్తను డిమాండ్ చేసిన భార్య వీడియో
సరికొత్త రికార్డుకు చేరిన గోల్డ్ ధర..ఈ ఏడాది ఏకంగా రూ.40 వేలు పెరిగిన పసిడి
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
