ట్రైన్ ఎక్కుతుండగా ముగ్గురు వ్యక్తులపై అనుమానం.. ఆరా తీయగా బ్యాగుల్లో కళ్లు చెదిరే!
ఎన్నికలు సమయం సమీపిస్తుండటంతో దేశవ్యాప్తంగా అధికారులు తనిఖీలు ముమ్మరం చేశారు. ప్రతిరోజూ ఎక్కడో అక్కడ నగదు పట్టుబడుతూనే ఉంది. కట్టలు కట్టలు క్యాష్ పలు వాహనాల్లో తరలిపోతోంది. ఓటర్లకు పంపిణీ చేసేందుకు తమదైనశైలిలో నగదును తరలిస్తున్నారు. ఈ నేపథ్యంలో చెన్నైలో భారీగా నగదు పట్టుబడుతోంది.
ఎన్నికలు సమయం సమీపిస్తుండటంతో దేశవ్యాప్తంగా అధికారులు తనిఖీలు ముమ్మరం చేశారు. ప్రతిరోజూ ఎక్కడో అక్కడ నగదు పట్టుబడుతూనే ఉంది. కట్టలు కట్టలు క్యాష్ పలు వాహనాల్లో తరలిపోతోంది. ఓటర్లకు పంపిణీ చేసేందుకు తమదైనశైలిలో నగదును తరలిస్తున్నారు. ఈ నేపథ్యంలో చెన్నైలో భారీగా నగదు పట్టుబడుతోంది. శనివారం హోసూరులో రూ.20 కోట్ల విలువైన 30 కేజీల బంగారాన్ని పట్టుకున్నారు పోలీసులు. తాజాగా తిరునల్వేలిలో రూ.4 కోట్ల నగదును పట్టుకున్నారు. పెద్దమొత్తంలో నగదు తరలిస్తున్నారన్న పక్కా సమాచారంతో తాంబరం రైల్వే స్టేషన్‌లో తనిఖీలు చేపట్టిన పోలీసులు భారీగా నగదును గుర్తించారు. తిరునల్వేలి బీజేపీ ఎమ్మెల్యే, ప్రస్తుత లోక్‌సభ అభ్యర్థి నయనార్ నాగేంద్రన్‌కి చెందినదిగా గుర్తించారు. ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. నగదుకు సంబంధించి ఆరాతీయగా ఎన్నికల్లో నగదు పంపిణి కి తీసుకురమ్మని చెప్పినట్టుగా పోలీసుల విచారణలో తేలింది.
క్యాండీ క్రష్లో బీహార్ యువకుడి ప్రపంచ రికార్డ్!
పండగ వేళ గుడ్న్యూస్.. యూపీఐ ట్రాన్సాక్షన్ ఛార్జీలు వాయిదా?
విదేశీ విద్యార్థులపై ‘ఓపీటీ’ పిడుగు..ఏకంగా 70 వేల డాలర్ల ఫీజు
వామ్మో గాడ్జిల్లా ఎల్నినో.. చేదెక్కిన సీతాఫలం!
దసరా పండుగకు టీజీఎస్ఆర్టీసీ బిగ్ ప్లాన్.. ఫ్రీ టికెట్ ఉంటుందా?
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో

