Manjummel Boys Review: హిట్టా.? ఫట్టా.? అక్కడ 20 కోట్లకి 200 కోట్లు వసూలు.. మరి ఇక్కడ.?
ఆల్రెడీ మలయాళంలో హిట్టైన సినిమా..!20 కోట్ల పెట్టుబడికి 200 కోట్లు వసూలు చేసిన సినిమా..! మలయాళ ఇండస్ట్రీలో బిగ్గెస్ట్ కలెక్షన్స్ రాబట్టిన సినిమా! అలాంటి ఈ సినిమా తెలుగులో తాజాగా రిలీజైంది. పాన్ ఇండియా ప్రొడక్షన్ హౌస్ మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాను తెలుగులో రిలీజ్ చేసింది. మరి మలయాళంలో దిమ్మతిరిగే రేంజ్లో హిట్టైన ఈ సినిమా తెలుగు ఆడియెన్స్‌కు నచ్చుతుందా? లేదా? తెలుసుకోవాలంటే వాచ్ దిస్ రివ్యూ.. !
మంజుమ్మల్ బాయ్స్ కథేంటంటే..! కేరళలోని కొచ్చికి చెందిన కుట్టన్ అలియాస్ షౌబిన్ షాహిర్, సుభాష్ అలియాస్ శ్రీనాథ్ భాషితో పాటు వారి స్నేహితులందరూ సొంత ఊళ్లోనే చిన్నాచితకా ఉద్యోగాలు చేసుకుంటూ లైఫ్ లీడ్ చేస్తుంటారు. ఈ గ్యాంగ్‌కు మంజుమ్మల్ బాయ్స్ పేరుతో ఓ అసోసియేషన్ ఉంటుంది. వీరంతా కలిసి ఓసారి కొడైకెనాల్ ట్రిప్‌నకు వెళ్తారు. కొడైకెనాల్‌లోని అందమైన ప్రదేశాలన్నీ చూశాక ఆఖరిలో గుణ కేవ్స్ చూడటానికి వెళ్తారు. ఆ గుహలు బయట నుంచి చూడటానికి ఎంత రమణీయంగా ఉంటాయో.. అంతే ప్రమాదకరం కూడా. ఎందుకంటే అక్కడ వందల అడుగుల లోతున్న ఎన్నో ప్రమాదకరమైన లోయలుంటాయి. వాటిలో డెవిల్స్ కిచెన్ కూడా ఒకటి. దాదాపు 150 అడుగులకు పైగా లోతున్న ఆ లోయలో 13మందికి పైగా పడగా.. ఏ ఒక్కరూ ప్రాణాలతో తిరిగి రాలేదు. అందుకే గుణ కేవ్స్‌లోని ఆ ప్రమాదకర లోయలున్న ప్రాంతాలున్న చోటుకు వెళ్లడాన్ని అటవీశాఖ వారు.. పోలీసులు నిషేధిస్తారు. కానీ, మంజుమ్మల్ బాయ్స్ అక్కడున్న అటవీ సిబ్బంది కళ్లుగప్పి.. ఫెన్సింగ్ దాటి గుణ కేవ్స్‌లోని ఆ ప్రమాదకరమైన ప్రదేశానికి వెళ్తారు. అక్కడ వారంతా సరదాగా గడుపుతుండగా అనుకోకుండా సుభాష్ అక్కడే ఉన్న అతి ప్రమాదకరమైన డెవిల్స్ కిచెన్ లోయలోకి జారిపడతాడు. మరి ఆ తర్వాత ఏమైంది? ఆ లోయ నుంచి సుభాష్‌ను ప్రాణాలతో కాపాడి తీసుకురావడానికి తోటి మిత్రులంతా ఏం చేశారు? పోలీసులు వాళ్లపై తిరగబడటానికి కారణమేంటి? అన్నది రిమైనింగ్ సినిమా..!
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
రాధమ్మ మదిలో కృష్ణయ్య.. చూడముచ్చటైన జంట గా తారక రామ , ప్రణతి.
ఆ విషయంలో ఇప్పటికీ వరుణ్ తేజ్ పై కోపమే ఉంది.! చిరు కామెంట్స్.
క్యాండీ క్రష్‌లో బీహార్ యువకుడి ప్రపంచ రికార్డ్!
పండగ వేళ గుడ్‌న్యూస్.. యూపీఐ ట్రాన్సాక్షన్ ఛార్జీలు వాయిదా?
విదేశీ విద్యార్థులపై ‘ఓపీటీ’ పిడుగు..ఏకంగా 70 వేల డాలర్ల ఫీజు
వామ్మో గాడ్జిల్లా ఎల్‌నినో.. చేదెక్కిన సీతాఫలం!
దసరా పండుగకు టీజీఎస్ఆర్టీసీ బిగ్ ప్లాన్.. ఫ్రీ టికెట్ ఉంటుందా?
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో

