ఆగస్ట్‌ 23, 1966 ..చంద్రుడి ఉపరితలం నుంచి భూమి ఎలా కనిపిస్తుందో ప్రజలు చూశారు !!

|

Aug 29, 2022 | 8:40 PM

NASA అంతరిక్ష నౌక చంద్రుడి పై నుంచి భూమి ఫొటోను తీసిన రోజు 23 ఆగష్టు 1966. ఈ ఫొటో చారిత్రాత్మకమైనది. మొట్టమొదటిసారి చంద్రుని ఉపరితలం నుండి భూమి ఎలా కనిపిస్తుందో ప్రజలు చూశారు.

NASA అంతరిక్ష నౌక చంద్రుడి పై నుంచి భూమి ఫొటోను తీసిన రోజు 23 ఆగష్టు 1966. ఈ ఫొటో చారిత్రాత్మకమైనది. మొట్టమొదటిసారి చంద్రుని ఉపరితలం నుండి భూమి ఎలా కనిపిస్తుందో ప్రజలు చూశారు. వార్తాపత్రికలు, మ్యాగజైన్‌లలో ముద్రించిన ఈ చిత్రాన్ని ప్రజలు కత్తిరించి ఇంట్లో ఉంచి తమ పిల్లలకు చూపించారు. 1960వ దశకంలో అపోలో మిషన్‌కు సంబంధించిన సన్నాహాలు అమెరికాలో పూర్తయ్యాయి. ఈ మిషన్ ఉద్దేశ్యం చంద్రునిపైకి మానవులను పంపడమే. కానీ చంద్రుని ఉపరితలం నిజంగా ఎలా ఉంటుందో శాస్త్రవేత్తలకు కూడా తెలియని పరిస్థితి. నాసా 1966 ఆగస్టు 10న ఆర్బిటర్-1ను ప్రయోగించింది. మెరుగైన చిత్రాల కోసం 68 కిలోల కోడెక్ ఇమేజింగ్ సిస్టమ్‌ను అమర్చారు. చంద్రుడిపైకి చేరుకున్న ప్రపంచంలోనే తొలి అంతరిక్ష నౌక ఇదే. 4 రోజుల ప్రయాణం తర్వాత చంద్రుడి కక్ష్యలోకి చేరుకున్న అంతరిక్ష నౌక భూమికి సంబంధించిన మొదటి ఫోటోను పంపింది. అంతరిక్ష నౌక చంద్రుని ఉపరితలం నుండి మొత్తం 205 ఫోటోలను తీసింది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఎవరికో వచ్చిన ఆర్డర్‌ లాక్కుని డెలివరీ బాయ్‌పై యువతి దాడి !!

టీవీలో వస్తున్న వీడియోను చూస్తూ.. ఈ కుక్క ఏం చేసిందో తెలుసా !!

Anjali: ఎగిరి గంతేసిన అంజలి.. ఈ ఆనందానికి కారణమేంటో ??

అలియా వేసుకున్న ఈ డ్రస్‌ కాస్ట్‌ ఎంతో తెలిస్తే.. నిజంగా షాకవుతారు !!

ఆ హీరో కర్మ గురించి మాట్లాడింది !! ఇప్పుడు అదే కర్మకు బలైంది !!

 

Published on: Aug 29, 2022 08:40 PM