Phool makhana: పూల్‌ మఖానాతో లాభాలు ఫుల్‌.. హార్మోన్స్‌ ను బ్యాలెన్స్‌ కు ఉపయోగం.

|

Jul 26, 2024 | 4:06 PM

పూల్‌ మఖానా.. అంటే తెలుసుగా.. అదేనండీ.. తామర గింజలు.. ఈ మధ్య వీటి వినియోగం బాగా ఎక్కువైంది. సూపర్‌ మార్కెట్లో విరివిగా దొరుకుతున్నాయి. ఇవి తినడం వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయి. అందుకే వీటికి డిమాండ్‌ బాగా పెరిగింది. ఇందులో మైక్రో న్యూట్రియెంట్లు అధికంగా ఉంటాయి. కాల్షియం, మెగ్నీషియం, ఐరన్‌, ఫాస్పరస్‌ పుష్కలంగా ఉంటాయి. అందుకే తామర గింజలను మన ఆహారంలో భాగం చేసుకుంటే మంచి ఆరోగ్యం మన సొంతమవుతుంది.

పూల్‌ మఖానా.. అంటే తెలుసుగా.. అదేనండీ.. తామర గింజలు.. ఈ మధ్య వీటి వినియోగం బాగా ఎక్కువైంది. సూపర్‌ మార్కెట్లో విరివిగా దొరుకుతున్నాయి. ఇవి తినడం వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయి. అందుకే వీటికి డిమాండ్‌ బాగా పెరిగింది. ఇందులో మైక్రో న్యూట్రియెంట్లు అధికంగా ఉంటాయి. కాల్షియం, మెగ్నీషియం, ఐరన్‌, ఫాస్పరస్‌ పుష్కలంగా ఉంటాయి. అందుకే తామర గింజలను మన ఆహారంలో భాగం చేసుకుంటే మంచి ఆరోగ్యం మన సొంతమవుతుంది. పూల్‌ మఖానాలో ఎన్నో పోషకాలు ఉంటాయి. ముఖ్యంగా ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు క్యాన్సర్‌ కారకాలను అడ్డుకుంటాయి. టైప్‌-2 మధుమేహం రాకుండా నిరోధిస్తాయి. రక్తంలో చక్కెర స్థాయిలను బ్యాలెన్స్‌ చేస్తాయి. పూల్‌ మఖానాలో ఉండే పైబర్‌ ఆకలిని తగ్గిస్తుంది. జీర్ణవ్యవస్థ పనితీరును మెరుగుపరిచి, మంచి బ్యాక్టీరియాను వృద్ధి చేస్తుంది.

ఇక ఈ పూల్‌ మఖానాలో యాంటీ ఏజింగ్‌ గుణాలు ఎక్కువగా ఉంటాయి. ఇందులో ఉండే అమినో యాసిడ్‌ చర్మంపై వచ్చే ముడతలు, మొటిమలను తగ్గిస్తుంది. ఇందులో ఉండే కాల్షియంతో ఎముకలు, దంతాలు బలంగా మారతాయి. ఎదిగే పిల్లలకు మంచి పోషకాహరం కూడా. దీంతో చాట్‌, మిక్చర్‌ కూడా చేయొచ్చు. దీనిని పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు. 100 గ్రాముల మఖానా తింటే 340 కేలరీలు అందుతాయి. ఫ్యాట్స్‌ శాతం అస్సలు ఉండదు కాబట్టి బరువు పెరుగుతారనే భయం లేదు. రోజులో 30 గ్రాముల వరకూ తీసుకోవచ్చు. ఈ తామర గింజలు హార్మోన్లను బ్యాలెన్స్‌ చేస్తాయి. తద్వారా భావోద్వేగాలు, ఒత్తిడి అదుపులో ఉంటాయి. రక్తపోటు కూడా తగ్గుతుంది. అంతేకాదు వీటిలో రక్తాన్ని శుద్ధిచేసే డిటాక్సిఫైయింగ్‌ ఏజెంట్స్‌ ఉంటాయి. అవి శరీరంలో ఉన్న మలినాల్ని కూడా బయటకు పంపుతాయి. వీటిలో ఉండే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు కిడ్నీ వాపు, నొప్పి సమస్యను తగ్గిస్తాయి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసం మాత్రమే. వీటిని ప్రయోగించేముందు సంబంధిత నిపుణులను సంప్రదించడం మంచిది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.

Follow us on