Vijay Sethupathi: నన్ను నేనే మిస్ అవుతున్నాను.. హార్ట్‌ ను టచ్ చేస్తున్న సేతుపతి మాటలు.

జీవితంలో చాలా సంపాదిస్తాం! పేరు ప్రఖ్యాతలు గడిస్తాం..! ఎన్నో ఎత్తు పల్లాలను చూస్తాం..! మంచి చెడులను ఎదుర్కొంటాం..! అలా జీవితంలో పయనించి.. పయనించి.. ఊరికే అలా సరదాకి వెనక్కి తిరిగి చూసుకుంటే.. మనల్ని మనమే మిస్ అవుతాం..! అదే ఫీలింగ్‌లో అప్పుడప్పుడూ బాధపడతాం.! మనల్ని పలకరించిన వారికి.. ఇదే విషయాన్ని చెబుతాం..! ఇప్పుడు మక్కల్ సెల్వన్ విజయ్‌ సేతుపతి కూడా ఇదే చేశారు.

Vijay Sethupathi: నన్ను నేనే మిస్ అవుతున్నాను.. హార్ట్‌ ను టచ్ చేస్తున్న సేతుపతి మాటలు.

|

Updated on: Jun 17, 2024 | 1:20 PM

జీవితంలో చాలా సంపాదిస్తాం! పేరు ప్రఖ్యాతలు గడిస్తాం..! ఎన్నో ఎత్తు పల్లాలను చూస్తాం..! మంచి చెడులను ఎదుర్కొంటాం..! అలా జీవితంలో పయనించి.. పయనించి.. ఊరికే అలా సరదాకి వెనక్కి తిరిగి చూసుకుంటే.. మనల్ని మనమే మిస్ అవుతాం..! అదే ఫీలింగ్‌లో అప్పుడప్పుడూ బాధపడతాం.! మనల్ని పలకరించిన వారికి.. ఇదే విషయాన్ని చెబుతాం..! ఇప్పుడు మక్కల్ సెల్వన్ విజయ్‌ సేతుపతి కూడా ఇదే చేశారు. దుబాయ్‌లో చిన్న ఉద్యోగం చేసే కుర్రాడి స్థాయి నుంచి… సినిమాల్లో స్టార్ హీరోగా ఎదిగే వరకు తన జర్నీలో.. తనను తానే మిస్ అవుతూ వచ్చా అంటూ కాస్త ఎమోషనల్ కామెంట్స్ చేశారు సేతుపతి. జీవిత పయనంలో అందరూ కోల్పోయేదేంటో చెప్పే ప్రయత్నం చేశారు.

“నన్ను నేనే మిస్ అవుతున్నాను.. అప్పట్లో ఓ కుర్రాడు ఉండేవాడు. అతడు చాలా అమాయకుడు.. అసలు ఏదైనా సాధించాలనే కలుల కూడా ఉండేవి కాదు. కనీసం జీవితంలో ఏం చేయాలి అనే క్లారిటీ కూడా లేని అబ్బాయి అతడు. ఫస్ట్ ఇయర్ కాలేజీలో చదువుతున్నప్పుడు సెకండ్ ఇయర్ సిలబస్ ఏంటీ అనేది కూడా తెలియని అబ్బాయి. ఫ్రెండ్స్ అందరూ ఇది సెకండ్ ఇయర్ సిలబస్ అని చెబితే నాకు తెలియదు అని ఆన్సర్ ఇచ్చేవాడిని. చదువు ఆటలు ఇలా ఎందులోనూ తోపు కాదు. కాలేజీ రోజుల్లో కనీసం అమ్మాయితో కూడా మాట్లాడేవాడిని కాదు. అప్పుడు చాలా సిగ్గు. కానీ జీవితంలో ఏదో పెద్దగా సాధించాలనే కోరిక మాత్రం ఆ కుర్రాడిలో ఉండేది. కానీ అది ఎలా చేయాలనేది మాత్రం తెలీదు. పెద్ద కలలు కూడా ఉండేవి కాదు. కేవలం తన పేదరికం నుంచి బయటపడాలి అనుకునేవాడు. ఆ కుర్రాడు ఇప్పుడు లేడు. వాడు చాలా క్యూట్. వాడినే నేను మిస్ అవుతున్నాను. ఆ నన్నే నేను మిస్ అవుతున్నాను” అంటూ విజయ్ సేతుపతి చెబుతూ ఎమోషనల్ అయ్యారు. తన మాటలతో ఇప్పుడు నెట్టింట విపరీతంగా వైరల్ అవుతున్నారు. అందర్నీ చప్పట్లు కొట్టేలా చేస్తున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.

Follow us