4 రోజుల్లో బంగాళాఖాతంలో అల్పపీడనం.. దంచికొట్టనున్న వర్షాలు

Updated on: Sep 09, 2025 | 4:51 PM

తెలుగు రాష్ట్రాల్లో మరోసారి భారీ వర్షాలు బీభత్సం సృష్టించనున్నాయి. సెప్టెంబరు 13న బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం హెచ్చరిక జారీ చేసింది. అల్పపీడనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని స్పష్టం చేసింది. ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

హైదరాబాద్ వాతావరణ కేంద్రం విడుదల చేసిన ప్రకటన ప్రకారం 13వ తేదీన బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుంది. ఇది ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిశా రాష్ట్రాల వైపు కదిలే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. దీని ప్రభావంతో సెప్టెంబరు 10 నుంచి 15వ తేదీ వరకు తెలుగు రాష్ట్రాల్లోని అనేక ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని తెలిపారు. కొన్ని చోట్ల బలమైన ఈదురుగాలులతో కూడిన కుండపోత వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇక తెలంగాణలోని పలు జిల్లాల్లో సెప్టెంబర 14వ తేదీ వరకు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వివరించింది. ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం, నల్గొండ సహా పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. గడిచిన 24 గంటల వ్యవధిలో ఇప్పటికే వరంగల్, హనుమకొండ, ములుగు జిల్లాల్లో మోస్తరు వర్షపాతం నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. వరంగల్‌లో అత్యధికంగా 5.92 సెంటీమీటర్ల వర్షం కురవగా, ఖిల్లా వరంగల్‌లో 5.57 సెం.మీ., గీసుకొండలో 4.50 సెం.మీ. వర్షపాతం రికార్డయింది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

బిడ్డ‌ను ఫ్రీజర్ లో పెట్టి మ‌రిచిపోయిన త‌ల్లి.. చివరకు

Viral Video: బురదలో కదలకుండా పడి ఉన్న వ్యక్తి.. శవం అనుకుని పట్టుకోగానే..

ప్రమోషన్ ఇవ్వని బాస్.. ఏకంగా కంపెనీనే కొనేసిన ఉద్యోగిని

గాజు టవర్ ను చూసారా? అక్కడి నుంచి భూటాన్​ను చూడొచ్చు

వాగ్దేవి ల్యాబ్స్ డ్రగ్స్ దందాతో కెమికల్ పరిశ్రమలపై డౌట్స్