ఆ నాలుగు కారణాల వల్లే 99శాతం మందిలో గుండెపోటు

Edited By: Phani CH

Updated on: Nov 29, 2025 | 2:33 PM

భారతదేశంలో అధిక మరణాలకు గుండె జబ్బులే ప్రధాన కారణంగా మారుతున్నాయి. 2014- 2019 మధ్య దేశంలో గుండెపోటుల సంఖ్య దాదాపు 50 శాతం పెరిగింది. పట్టణీకరణ, మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్లు సరిగా లేకపోవడం, ఒత్తిడి, ధూమపానం, మధుమేహం వంటి వ్యాధులు ప్రధాన కారణాలు. ఈ సమస్య ఆరోగ్యానికే పరిమితం కాకుండా, దేశ ఆర్థిక వ్యవస్థ, కుటుంబ స్థిరత్వం, పని విధానాన్ని కూడా ప్రభావితం చేస్తోందని నిపుణులు చెబుతున్నారు.

భారతదేశంలో అధిక మరణాలకు గుండె జబ్బులే ప్రధాన కారణంగా మారుతున్నాయి. 2014- 2019 మధ్య దేశంలో గుండెపోటుల సంఖ్య దాదాపు 50 శాతం పెరిగింది. పట్టణీకరణ, మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్లు సరిగా లేకపోవడం, ఒత్తిడి, ధూమపానం, మధుమేహం వంటి వ్యాధులు ప్రధాన కారణాలు. ఈ సమస్య ఆరోగ్యానికే పరిమితం కాకుండా, దేశ ఆర్థిక వ్యవస్థ, కుటుంబ స్థిరత్వం, పని విధానాన్ని కూడా ప్రభావితం చేస్తోందని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా గుండె జబ్బులకు నాలుగు ప్రధాన కారణాలు ఉన్నాయన్నారు. గుండెకు రక్త ప్రసరణ గడ్డకట్టడం లేదా గుండెకు దారితీసే ధమనులలో అడ్డంకులు ఏర్పడినప్పుడు గుండెపోటు వస్తుంది. ఇది గుండె కండరానికి ఆక్సిజన్ చేరకుండా నిరోధిస్తుంది. దీనివల్ల కణాలు తక్కువ సమయంలోనే చనిపోతాయి. సకాలంలో చికిత్స అందకపోతే, అది ప్రాణాంతకం కావచ్చు. చాలా సార్లు గుండెపోటు, స్ట్రోక్‌, హార్ట్‌ ఫెయిల్యూర్‌ వంటి సమస్యలు హఠాత్తుగా రావని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అధిక రక్తపోటు,కొలెస్ట్రాల్,మధుమేహం,ధూమపానం వంటి కారణంగా గుండెపోటు సమస్యలు తలెత్తుతాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. చాలా మందికి మొదటిసారిగా గుండెపోటు అకస్మాత్తుగా రాకపోవచ్చు అని వైద్యులు తెలిపారు. అధిక రక్తపోటు, కొలెస్ట్రాల్, రక్తంలో చక్కెర లేదా డయాబెటిస్, ధూమపానం వంటి వాటివల్ల గుండెపోటు వచ్చే అవకాశం ఉంది. ఆరోగ్యకరమైన ఆహారం, క్రమం తప్పకుండా వ్యాయామం, వైద్య పరీక్షలు వంటివి గుండెపోటు ప్రమాదాన్ని గణనీయంగా తగ్గిస్తాయి. దీని కోసం మీ ఆహారంలో కొన్ని సర్దుబాట్లు చేసుకోవాలి. పండ్లు, ఆకుపచ్చ కూరగాయలు, తృణధాన్యాలు, ఆరోగ్యకరమైన కొవ్వులు వంటివి చేర్చుకోవాలి. అదనంగా, ప్రతిరోజూ కనీసం 30 నిమిషాల వాకింగ్‌ లేదా యోగాతో చిన్న చిన్న వ్యాయామం చేయండి. సాధ్యమైనంత వరకు ధూమపానం మానేయండి. పొగాకు మానేయడం వల్ల గుండె జబ్బుల ప్రమాదం వెంటనే తగ్గుతుంది. చాలా వరకు గుండెపోటు ఆ వ్యక్తి ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయడం వల్లే వచ్చే అవకాశముంది. ముఖ్యంగా 30 ఏళ్లు పైబడిన వారు లేదా గుండె జబ్బుల కుటుంబ చరిత్ర ఉన్నవారు క్రమం తప్పకుండా కొన్ని రకాల హెల్త్‌ టెస్టులు తప్పనిసరిగా చేయించుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

కేంద్రం సంచలన నిర్ణయం.. 2 కోట్ల ఆధార్ నెంబర్లు తొలగింపు ??

TOP 9 ET News: జక్కన్న కిర్రాక్‌ ప్లాన్ !! ఈ సారి హాలీవుడ్‌ షేకవ్వడం పక్కా

Manchu Lakshmi: వాళ్ల వల్ల నేను అనుభవించిన బాధ.. నా ఒక్కదానికే తెలుసు

మంగ్లీని పచ్చి బూతులు తిడుతూ వీడియో.. దెబ్బకు జైల్లో పెట్టించిన సింగర్

Hema Chandra: విడాకుల పై ప్రశ్నించినందుకు.. యాంకర్‌కు ఇచ్చిపడేసిన సింగర్ హేమచంద్ర