మీ ఆరోగ్యాన్ని దెబ్బతీసే అలవాట్లు ఇవే వీడియో

Updated on: May 11, 2025 | 3:22 PM

ప్రతిరోజు మనం అనుసరించే కొన్ని ఆరోగ్య అలవాట్లు చూడడానికి వినడానికి మంచిగా అనిపించిన మంచివిగా అనిపిస్తాయి. కానీ వాటిని మితిమీరిన రీతిలో చేయడం వల్ల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాలు చూపించే అవకాశం ఉంది. అలాంటి కొన్ని అలవాట్లు వాటి దుష్ప్రభావాల గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. నీళ్లు తాగడం ఆరోగ్యానికి ఎంతో అవసరం. కానీ అవసరానికి మించి నీరు తాగితే శరీరంలో సోడియం స్థాయిలు తగ్గిపోతాయి. దీనివల్ల తలనొప్పి, విరక్తి, వాంతులు వంటి లక్షణాలు కనిపించవచ్చు. శరీరంలో ఎలక్ట్రోలైట్ స్థాయిలు సమతుల్యత కోల్పోతాయి. పండ్లు ఆరోగ్యానికి మంచివే కానీ చాలా పండ్లలో ప్రకృతి సహజంగా చక్కెర ఎక్కువగా ఉంటుంది.