భారత్‌లో ఆమె ఫొటోతో నకిలీ ఓట్లు ?? లారిస్సా ఏమంది అంటే

Updated on: Nov 10, 2025 | 4:01 PM

హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో 25 లక్షల నకిలీ ఓట్ల ఆరోపణలపై రాహుల్ గాంధీ బ్రెజిలియన్ యువతి లారిస్సా నెరీ ఫోటోను ప్రదర్శించారు. తన పాత ఫోటో ఓట్ల చోరీ వార్తల్లో వైరల్ కావడంపై లారిస్సా నెరీ ఆశ్చర్యం వ్యక్తం చేసింది. తనను భారతీయురాలిగా చిత్రీకరించి మోసం చేస్తున్నారని, ఇది తన 18 ఏళ్ల నాటి ఫోటో అని స్పష్టం చేసింది. ఈ పరిణామం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.

గత ఏడాది హర్యానాలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 25 లక్షల నకిలీ ఓట్లు ఉన్నాయని, అందువల్లే బీజేపీ అధికారంలోకి వచ్చిందని రాహుల్‌గాంధీ ఆరోపించారు. బ్రెజిల్‌ మోడల్‌ ఫొటోను చూపించి ఆమె ఫోటోతో 22 నకిలీ ఓట్లు సృష్టించినా ఎలక్షన్‌ కమిషన్‌ ఎందుకు కనిపెట్టలేకపోయిందని ప్రశ్నించారు. రాహుల్‌ తన మీడియా సమావేశంలో ఆమె ఫోటోను ప్రదర్శించి.. ‘ఈమె ఎవరు?’ అని అడగడంతో నెటిజెన్లంతా ఆమె ఆచూకీ కోసం గూగుల్‌, ఇన్‌స్టా, ఎక్స్‌, ఫేస్‌బుక్‌ వంటి సామాజిక మాధ్యమాల్లో తెగ గాలించారు. రాహుల్‌ ప్రదర్శించిన ఫోటో ఆధారంగా ఇమేజ్‌ సెర్చ్‌ కూడా చేశారు. కానీ ఎక్కడా ఆమె ఆచూకీ తెలియరాలేదు. ఆమె బ్రెజిలియనే. కానీ మోడల్‌ కాదు. పేరు లారిస్సా నెరీ. లారిసా తాజాగా తన ఇన్‌స్టా పేజీలో స్పందించింది. ఓట్ల చోరీ వార్తల్లో తన పేరు రావడం చూసి షాకయ్యానని తెలిపింది. చాలామంది తనకు ఫోన్లు చేస్తున్నారని, ఇంటర్వ్యూలు అడుగుతున్నారని చెప్పింది. ఇలా వైరల్‌ అవుతానని అనుకోలేదని ఆమె అంది. అది తన పాత ఫొటో అని.. ఆ ఫొటో తీసే సమయానికి తన వయసు 18 ఏళ్లని తెలిపింది. ‘‘గైస్‌.. అది పాత ఫొటో.. ఇండియాలో ఎన్నికల కోసమో.. ఓటింగ్‌కు సంబంధించో.. నా ఫొటోను వాడుకుంటున్నారు. ప్రజలను మోసం చేయడానికి నన్ను భారతీయురాలిగా చిత్రీకరిస్తున్నారు. ఇదేం పిచ్చి? ఇదేం వెర్రి? దేవుడా.. మనం ఎలాంటి ప్రపంచంలో బతుకుతున్నాం’’ అని నవ్వుతూ ఆశ్చర్యాన్ని వ్యక్తపరిచింది. తాను ప్రస్తుతం ఒక సెలూన్‌లో పని చేస్తున్నానని.. తన ఫొటో వైరల్‌ కావడంతో ఒక పాత్రికేయుడు తాను పనిచేస్తున్న సెలూన్‌కు వచ్చి ఇంటర్వ్యూ కోసం కూడా అడిగాడని తెలిపింది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

టీచర్‌కు రూ.88 కోట్ల నష్టపరిహారం.. ఆ రోజు ఏం జరిగిందంటే ??

బహుబలి అరటి హస్తం..ఏకంగా 80 పండ్లు.. సెల్ఫీ దిగిన కొనుగోలుదారులు

భారత్‌లో స్టార్‌లింక్ సేవలు.. ఇక పల్లెల్లోనూ హైస్పీడ్ నెట్

భారత్‌కు రష్యా బంపర్ ఆఫర్.. శత్రు దేశాలకు ఇక.. దబిడి దిబిడే

నడిరోడ్డుపై వ్యక్తి పరుగులు.. ప్లాన్డ్‌గా పట్టుకున్న ఏసీబీ అధికారులు