AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చదువుకున్న కోడలు కావాలి.. కానీ ఉద్యోగం చేయొద్దు !! మ్యాట్రిమోనియల్ పోస్ట్ వైరల్

చదువుకున్న కోడలు కావాలి.. కానీ ఉద్యోగం చేయొద్దు !! మ్యాట్రిమోనియల్ పోస్ట్ వైరల్

Phani CH
|

Updated on: Mar 09, 2026 | 12:17 PM

Share

గురుగ్రామ్‌లోని Knot.Dating CEO జస్వీర్ సింగ్, "చదువుకున్న కోడలు కావాలి, కానీ ఉద్యోగం చేయకూడదు" అనే తల్లి షరతును బహిర్గతం చేయడంతో ఈ విషయం వైరల్ అయ్యింది. విద్యావంతులైన మహిళల కెరీర్‌కు అడ్డుకట్ట వేయాలనే ఆధునిక సమాజంలోని ద్వంద్వ వైఖరిని ఈ ఘటన స్పష్టం చేసింది. ఈ పోస్ట్ మహిళల విద్య, స్వాతంత్ర్యం, వివాహంలో సమాన భాగస్వామ్యంపై విస్తృత చర్చకు దారితీసింది.

గురుగ్రామ్‌లోని ఓ మ్యాట్రిమోనియల్ యాప్ సీఈవో చేసిన ఓ పోస్ట్ ఇప్పుడు చర్చకు దారి తీసింది. “చదువుకున్న కోడలు కావాలి, కానీ పెళ్లి తర్వాత ఉద్యోగం చేయకూడదు” అనే ఓ తల్లి మనస్తత్వాన్ని ఆయన బయటపెట్టడంతో, ఆధునిక సమాజంలో మహిళల పట్ల చూసే చిన్నచూపు ద్వంద్వ వైఖరిపై మరోసారి చర్చ మొదలైంది. గురుగ్రామ్‌లోని Knot.Dating అనే మ్యాట్రిమోనియల్ యాప్ సీఈవో జస్వీర్ సింగ్ తన కార్యాలయంలో జరిగిన ఒక సంభాషణను గమనించారు. సౌత్ ఢిల్లీకి చెందిన ఒక తల్లి, తన కొడుకు కోసం వధువును వెతుకుతూ వారి సంస్థను సంప్రదించారు. ఆమె కొడుకు ఏడాదికి రూ. 73 లక్షలు సంపాదిస్తూ వ్యాపారం చేస్తున్నాడు. ఆ తల్లి తమకు కాబోయే కోడలు ఎత్తుగా, తెల్లగా, అందంగా, మంచి కుటుంబానికి చెందినదై ఉండాలని పలు లక్షణాలు వివరించారు. అయితే, ఆమె పెట్టిన ఓ షరతు అందరినీ ఆశ్చర్యపరిచింది. తమది వ్యాపార కుటుంబమనీ పెళ్లి తర్వాత కోడలు ఉద్యోగం చేయడానికి వీల్లేదని ఆమె స్పష్టం చేశారు. బాగా చదువుకుని, మంచి కాలేజీలో చదివిన స్మార్ట్ అమ్మాయి కావాలి కానీ, ఆమె కెరీర్‌ను కొనసాగించకూడదని తేల్చిచెప్పారు. ఈ ఘటనపై జస్వీర్ సింగ్ తన ఎక్స్ ఖాతాలో తీవ్రంగా స్పందించారు. “మీరు మీ కొడుకు కోసం భాగస్వామిని వెతకడం లేదు. అందమైన శరీరంతో, డిగ్రీ ఉన్న ఒక పనిమనిషి కోసం చూస్తున్నారు. చదువు ఉండాలి కానీ ఆశయాలు ఉండకూడదు, ఆధునికంగా కనిపించాలి కానీ సంప్రదాయంగా నడుచుకోవాలి, స్మార్ట్‌గా ఉండాలి కానీ లొంగి ఉండాలి. కార్పొరేట్ సక్సెస్ రెజ్యూమే కావాలి, కానీ 1950ల నాటి విధేయత కోరుకుంటున్నారు” అంటూ ఆయన ఘాటుగా విమర్శించారు. ఈ పోస్ట్ క్షణాల్లో వైరల్ కావడంతో, మహిళల విద్య, స్వాతంత్ర్యం, వివాహంలో సమాన భాగస్వామ్యం వంటి అంశాలపై నెటిజన్లు విస్తృతంగా చర్చిస్తున్నారు. ఉన్నత విద్యావంతురాలైన అమ్మాయిని కోరుకుంటూనే, ఆమె కెరీర్‌కు అడ్డుకట్ట వేయాలనుకునే ఇలాంటి మనస్తత్వంపై పలువురు మండిపడుతున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

చెరువుగట్టుపై భయానక దృశ్యం.. భయంతో వణికిపోయిన జనం

అద్భుతం.. మూగజీవికి పునర్జన్మ.. ప్రాణం నిలిపిన సీపీఆర్‌

Follow Us