Indian Railways: ఆన్ డ్యూటీ అయినా సరే టికెట్ ఉండి తీరాల్సిందే

|

Aug 08, 2024 | 1:16 PM

విధుల్లో భాగంగా రైళ్లలో ప్రయాణించే గవర్నమెంట్ రైల్వే పోలీసులు, రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ సిబ్బంది తప్పనిసరిగా ఒక ట్రావెల్‌ అథారిటీ..డ్యూటీ కార్డ్ పాస్‌ లేదా టికెట్‌‌ను తప్పనిసరిగా కొనుగోలు చేయాల్సిందేనని రైల్వే స్పష్టం చేసింది. ఐడీ కార్డుతో ప్రయాణించి విధుల్లో ఉన్నానంటే చెల్లుబాటుకాదని పేర్కొంది. విధుల్లో ఉన్న సమయంలో తాను రైలు నుంచి జారిపడ్డానని, ఒక కాలును కోల్పోయినందున పరిహారం చెల్లించాలంటూ ఓ కానిస్టేబుల్‌ దాఖలు చేసిన పిటిషన్‌ను.

విధుల్లో భాగంగా రైళ్లలో ప్రయాణించే గవర్నమెంట్ రైల్వే పోలీసులు, రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ సిబ్బంది తప్పనిసరిగా ఒక ట్రావెల్‌ అథారిటీ..డ్యూటీ కార్డ్ పాస్‌ లేదా టికెట్‌‌ను తప్పనిసరిగా కొనుగోలు చేయాల్సిందేనని రైల్వే స్పష్టం చేసింది. ఐడీ కార్డుతో ప్రయాణించి విధుల్లో ఉన్నానంటే చెల్లుబాటుకాదని పేర్కొంది. విధుల్లో ఉన్న సమయంలో తాను రైలు నుంచి జారిపడ్డానని, ఒక కాలును కోల్పోయినందున పరిహారం చెల్లించాలంటూ ఓ కానిస్టేబుల్‌ దాఖలు చేసిన పిటిషన్‌ను రైల్వే క్లెయిమ్స్‌ ట్రైబ్యునల్‌ కొట్టివేసింది. అతడి వద్ద ట్రావెల్ అథారిటీ లేదా రైలు టికెట్ లేకపోవడంతో పరిహారం పొందలేడని స్పష్టం చేసింది. ఈ మేరకు రైల్వే శాఖకు ట్రైబ్యునల్ అహ్మదాబాద్ బెంచ్ స్పష్టం చేసింది. రాజేశ్ బగుల్ అనే జీఆర్‌పీ కానిస్టేబుల్ ప్రమాదం జరిగిన రోజున తాను అధికారిక విధుల్లో ఉన్నానని, కాబట్టి వడ్డీ సహా మొత్తం రూ.8 లక్షల నష్టపరిహారం చెల్లించాలని ట్రైబ్యునల్‌ను ఆశ్రయించాడు. నవంబర్ 13, 2019న డ్యూటీ కోసం సూరత్ రైల్వే పోలీస్ స్టేషన్‌కు వెళ్లానని చెప్పాడు. సూరత్ నుంచి తిరిగి సూరత్-జామ్‌నగర్ ఇంటర్‌సిటీ రైలులో బరూచ్‌కి వెళ్తున్న సమయంలో పాలేజ్ స్టేషన్‌ దాటాక పడిపోయానని, ఎడమ కాలుకు తీవ్రమైన గాయాలయ్యాయని, కాలుని మోకాలి పై వరకు తొలగించాల్సి వచ్చిందని వివరించాడు. అయితే రాజేశ్ వాదనలను నిరూపించే డాక్యుమెంటరీ సాక్ష్యాధారాలు లేవని రైల్వే వాదించింది.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఇండిగో కీలక నిర్ణయం.. దేశీయ మార్గాల్లోనూ బిజినెస్‌ క్లాస్‌

Allu Arjun: నాని పోస్ట్‌పై స్పందించిన అల్లు అర్జున్‌.. వైరల్‌గా మారిన ట్వీట్‌

TOP 9 ET News: కేరళకు ప్రభాస్‌ రూ.2 కోట్ల సాయం.. | దేవర చుట్టమల్లే సాంగ్‌కు దిమ్మతిరిగే రెస్పాన్స్ .

Explainer: క్రెడిట్ కార్డ్ – రెండు వైపులా పదునున్న కత్తి