Loading video

Nifa Virus: కేరళలో నిఫా వైరస్‌ కారణంగా అసహజ మరణాలు.. అప్రమత్తమైన ప్రభుత్వం.

|

Sep 14, 2023 | 8:03 AM

కేరళలో నిఫా వైరస్ కలకలం రేపుతోంది. కోజికోడ్ లో జ్వరంతో ఇద్దరు వ్యక్తులు అసహజ మరణానికి గురి కావడంతో రాష్ట్ర ఆరోగ్య శాఖ అప్రమత్తమై హెచ్చరికలను జారీ చేసింది. నిఫా వైరస్ కారణంగానే వీరి మరణాలు సంభవించి ఉండొచ్చని వైద్య శాఖ వర్గాలు అనుమానిస్తున్నాయి. కోజికోడ్ లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో ఇద్దరు వ్యక్తులు మరణించడం తాజా పరిణామానికి దారి తీసింది. మరణించిన వ్యక్తుల్లో ఒకరి సమీప బంధువు కూడా...

కేరళలో నిఫా వైరస్ కలకలం రేపుతోంది. కోజికోడ్ లో జ్వరంతో ఇద్దరు వ్యక్తులు అసహజ మరణానికి గురి కావడంతో రాష్ట్ర ఆరోగ్య శాఖ అప్రమత్తమై హెచ్చరికలను జారీ చేసింది. నిఫా వైరస్ కారణంగానే వీరి మరణాలు సంభవించి ఉండొచ్చని వైద్య శాఖ వర్గాలు అనుమానిస్తున్నాయి. కోజికోడ్ లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో ఇద్దరు వ్యక్తులు మరణించడం తాజా పరిణామానికి దారి తీసింది. మరణించిన వ్యక్తుల్లో ఒకరి సమీప బంధువు కూడా ఆసుపత్రిలోని ఐసీయూలో చికిత్స పొందుతుండగా, అతడి నమూనాలను పరీక్షల కోసం ల్యాబ్ కు పంపించారు. సెప్టెంబర్‌ 13 నాటికి ఫలితం రావచ్చని అంచనా వేస్తున్నారు. రాష్ట్ర ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ నేతృత్వంలో ఉన్నతస్థాయి సమావేశం జరిగింది. గతంలోనూ కోజికోడ్ ప్రాంతంలో నిఫా వైరస్ ఆనవాళ్లు కనిపించాయి. 2018లో, 2021లో ఒక్కొక్కరు ఈ వైరస్ కారణంగా మరణించారు. 2018లో మొదటిసారి ఈ వైరస్ కేరళలో కనిపించగా, అప్పట్లో 23 మందికి పాజిటివ్ గా తేలింది. ఈ వైరస్ పలు రూపాల్లో కనిపిస్తుంటుంది. కొందరిలో ఎలాంటి లక్షణాలు ఉండవు. కొందరిలో తీవ్ర ఊపిరితిత్తుల అనారోగ్యం ఎదురవుతుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం, జంతువుల ద్వారా మనుషులకు ఈ వైరస్ వ్యాపిస్తుంది. కలుషితమైన ఆహారం లేదా వ్యాధి బారినపడ్డ వారి సమీపంలోకి వెళితే ఇన్‌ఫెక్షన్ బారిన పడతారు. నీపా వైరస్ రోగుల్లో కొందరికి ఎటువంటి లక్షణాలు ఉండవు. మరికొందరిలో మాత్రం ఊపిరితిత్తులకు సంబంధించిన సమస్యలు కనిపిస్తే, ఇంకొందరు ప్రాణాంతకమైన మెదడువాపు బారినపడతారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్‌ మనీ తెలిస్తే షాకవుతారు..!

Mahesh Babu: హాలీవుడ్‌ గడ్డపై మహేష్‌ దిమ్మతరిగే రికార్డ్‌.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.

Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..