Weather Report: తెలుగు రాష్ట్రాల ప్రజలకు గుడ్‌న్యూస్‌.. ఈ సారి నైరుతి ముందే వస్తోంది..

|

May 16, 2024 | 1:01 PM

తెలుగు రాష్ట్రాల ప్రజలకు గుడ్‌న్యూస్‌.. అధిక ఉష్ణోగ్రతలు, ఉక్కపోత, వడగాలులతో అల్లాడుతున్న ప్రజలకు వాతావరణశాఖ చల్లని కబురు చెప్పింది. అవును ఈసారి నైరుతి రుతుపవనాలు కాస్త ముందుగానే ప్రవేశిస్తాయని సోమవారం ఒక ప్రకటనలో వెల్లడించింది. మే 19 నాటికి దక్షిణ అండమాన్‌ సముద్రం, దాన్ని ఆనుకుని ఉన్న ఆగ్నేయ బంగాళాఖాతం, నికోబార్‌ దీవుల్లోకి ప్రవేశిస్తాయని తెలిపింది.

తెలుగు రాష్ట్రాల ప్రజలకు గుడ్‌న్యూస్‌.. అధిక ఉష్ణోగ్రతలు, ఉక్కపోత, వడగాలులతో అల్లాడుతున్న ప్రజలకు వాతావరణశాఖ చల్లని కబురు చెప్పింది. అవును ఈసారి నైరుతి రుతుపవనాలు కాస్త ముందుగానే ప్రవేశిస్తాయని సోమవారం ఒక ప్రకటనలో వెల్లడించింది. మే 19 నాటికి దక్షిణ అండమాన్‌ సముద్రం, దాన్ని ఆనుకుని ఉన్న ఆగ్నేయ బంగాళాఖాతం, నికోబార్‌ దీవుల్లోకి ప్రవేశిస్తాయని తెలిపింది. ఇక దక్షిణ కర్ణాటక నుంచి వాయవ్య మధ్యప్రదేశ్‌ వరకు విస్తరించి ఉన్న ద్రోణి ప్రభావంతో రాబోయే నాలుగు రోజుల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణశాఖ తెలిపింది. మంగళవారం వడగాలుల ప్రభావం ఉండదని, శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, డా.బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది. రాయలసీమ జిల్లాల్లో అక్కడక్కడా తేలికపాటి వర్షం పడొచ్చని అంచనా వేసింది. ప్రకాశం, అల్లూరి సీతారామరాజు, శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు, శ్రీసత్యసాయి, బాపట్ల, అనకాపల్లి, విశాఖపట్నం, కాకినాడ, నంద్యాల, శ్రీకాకుళం తదితర జిల్లాల్లో సోమవారం తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిశాయి. అత్యధికంగా ప్రకాశం జిల్లా బల్లిపల్లిలో 79 మి.మీ. వర్షపాతం నమోదైంది. వర్షాల ప్రభావంతో ప్రజలకు వడగాలుల నుంచి ఉపశమనం లభించింది. సోమవారం ఏలూరు జిల్లా జీలుగుమిల్లిలో 41.2 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

మెట్రోను ఇలా ఎక్కితేనే ప్రశాంతం.. వీడియో చూసి ఆశ్చర్యపోతున్న నెటిజన్లు

తండ్రి లక్షల పెన్షన్ కోసం.. కూతురు ఏం చేసిందో తెలుసా ??

‘ధనుష్ ఒక గే’.. నా భర్తతో బెడ్ షేర్ చేసుకున్నాడు

దేవర డేట్‌పై కన్నేసిన చెర్రీ.. అంటే పోరు తప్పదన్నట్టే..!

Upasana Konidela: మా ఆయన వల్లే డిప్రెషన్‌ నుంచి బయటపడ్డా..

 

Follow us on