వ్యాయామం చేసిన తర్వాత ఇవి అసలు తినకూడదు

Updated on: Jan 22, 2025 | 6:01 PM

ఉదయాన్నే వ్యాయామం చేసిన తర్వాత ఆకలిగా అనిపిస్తుందని చేతికి ఏది దొరికితే అది తినేస్తున్నారా? జాగ్రత్త. వర్కవుట్స్‌ చేసిన తర్వాత తినే ఆహారం విషయంలో చాలా జాగ్రత్త తీసుకోవాలనంటున్నారు నిపుణులు. అవేంటో చూద్దాం. కూల్ డ్రింక్స్‌, చక్కెరతో చేసిన ఫ్రూట్‌ జ్యూస్‌, పేస్ట్రీస్‌, స్వీట్స్‌. ఇవేవీ వ్యాయామం చేసిన తర్వాత తీసుకోకూడదు.

ఎందుకంటే వీటిలో అధిక మోతాదులో కేలరీలు ఉంటాయి. అలాగే ఫ్రైడ్‌ చికెన్‌, ఫ్రెంచ్‌ ఫ్రైస్‌లో అనారోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి. వ్యాయామయం అనంతరం ఇలాంటి ఆహారం అస్సలు తీసుకోకూడదంటున్నారు నిపుణులు. ఇవి జీర్ణం కావడానికి ఎక్కువ సమయం పడుతుందంటున్నారు. అంతేకాదు ఉప్పు ఎక్కువగా ఉండే స్నాక్స్‌, ఆలూ చిప్స్‌ కూడా తినడం మంచిది కాదంటున్నారు. ప్రాసెస్‌ చేసిన మాంసం, పిజ్జాలో సాచురేటెడ్‌ ఫ్యాట్స్‌, సోడియం అధికంగా ఉంటాయి. వీటి వల్ల శరీరం డీ హైడ్రేషన్‌కు గురవుతుంది. అనవసరపు కొవ్వులు పేరుకుంటాయి. ఇలాంటి ఆహారాన్ని వ్యాయామం తర్వాత తీసుకోవద్దంటున్నారు. వర్కౌట్స్‌ చేసిన తర్వాత మద్యం తీసుకుంటే కండరాలను డ్యామేజ్‌ చేయడమే కాకుండా ఇతర అనారోగ్యాలకు కారణమవుతుంది. ప్రొటీన్‌ తీసుకున్నా అది శరీరానికి పట్టదంటున్నారు నిపుణులు.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

స్పామ్ కాల్స్ ఆటకట్టు, సంచార్ సాథీ యాప్ తెచ్చిన కేంద్రం

ట్రంప్ ర్యాపిడ్‌ ఫైర్‌.. వరుస ఆదేశాలు..

ఆర్జీకర్‌ వైద్యురాలి మృతదేహంపై మహిళ డీఎన్ఏ ఆనవాళ్లు..! ఆమె ఎవరు?

శ్రీవారి భక్తులకు గుడ్‌ న్యూస్‌.. అన్నప్రసాదంలో ఇకపై కొత్త ఐటమ్

Trump – Putin: పుతిన్‌కు మొదటి రోజే షాకిచ్చిన ట్రంప్‌