చెరువులో ఈతకు దిగి ఐదుగురు బాలురు మృతి

Updated on: May 16, 2025 | 5:31 PM

కడప జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. సెలవులలో ఆనందంగా గడపడానికి అమ్మమ్మ ఇంటికి వచ్చి తిరిగిరాని అనంతలోకాలకు వెళ్లిపోయారు. ఈతకు వెళ్ళి ఐదుగురు బాలురు మృతి చెందారు. చెరువులో ఈతకు వెళ్లి గుంటలో ఇరుక్కుని బయటకు రాలేక ఊపిరి ఆడక ప్రాణాలు వదిలారు. అందరు కలిసికట్టుగా ఒకే గుంటలో ఇరుక్కుని ప్రాణాలు వదిలారు. మైదుకూరు నియోజకవర్గంలోని బ్రహ్మంగారి మఠం మండలం మల్లేపల్లి గ్రామంలో విషాదం చోటుచేసుకుంది.

సెలవులపై అమ్మమ్మ ఇంటికి వచ్చిన చిన్నారులు మధ్యాహ్నం మూడు గంటల సమయంలో మల్లేపల్లి గ్రామంలోని చెరువులో ఈతకు వెళ్లారు. సాయంత్రం అయినా బయటకు వెళ్లిన పిల్లలు ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు కంగారుపడ్డారు. గ్రామంలో వెతుకుతుండగా పిల్లల బట్టలు, చెప్పులు చెరువు ఒడ్డున కనిపించాయి. దీంతో గ్రామస్తులంతా చెరువు వద్దకు చేరుకుని పోలీసులకు సమాచారం ఇచ్చారు. సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు, గజ ఈతగాళ్లతో చెరువులో పిల్లల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. రాత్రి వరకు పిల్లల ఆనవాళ్ళు తెలియలేదు. రాత్రి అయినా పోలీసులు, ఫైర్ సిబ్బంది, గజఈతగాళ్లు ఆపకుండా వెతకడంతో పిల్లలంతా ఒకే చోట విగత జీవులై కనిపించారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

బరువు తగ్గాలనుకునే వారికి బఠానీలు బెస్ట్‌ చాయిస్‌

పల్లీలు నువ్వులు కలిపి తింటే ఎన్ని లాభాలో ??

పచ్చి మామిడికి ఫుల్‌ డిమాండ్‌.. కారణం అదేనా ??

ఈ లక్షణాలు మీలో కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు

Published on: May 16, 2025 05:24 PM
Follow Us