విద్యార్థుల కళ్లలో ఫెవిక్విక్ పోశారు.. కారణం ఇదే..వీడియో

Updated on: Sep 15, 2025 | 3:18 PM

ఒడిశా కంధమాల్ జిల్లా ఫిరింగియా బ్లాక్‌లోని సలగూడా సెబాశ్రమ్ విద్యాలయంలోదారుణ ఘటన జరిగింది. హాస్టల్‌లో రాత్రి నిద్రపోతున్న 8 మంది విద్యార్థుల కళ్లలో తోటి విద్యార్థులే ఫెవిక్విక్ పోశారు. దీంతో విద్యార్థుల కళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే వారిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో అక్కడి నుండి ఫుల్బాని జిల్లా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అందులో ఏడుగురు విద్యార్థులు ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా.. ఒకరి పరిస్థితి మెరుగుపడింది. దీంతో ఆ విద్యార్ధిని డిశ్చార్జ్ చేశారు. హాస్టల్‌లోని రెండు వర్గాల విద్యార్థుల మధ్య సాధారణంగా జరిగే గొడవల కారణంగానే ఇలా ప్రవర్తించినట్లు సమాచారం. ఆ గొడవ కాస్తా తీవ్రస్థాయికి చేరి తమతో గొడవ పెట్టుకున్న వాళ్లను ఎలాగైనా ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశ్యంతో కళ్లల్లో ఫెవిక్విక్ పోసినట్టు ప్రాథమికంగా అంచనా వేశారు.

వైద్యుల సమాచారం ప్రకారం.. విద్యార్థులకు సమయానికి చికిత్స లభించడంతో ప్రాణాపాయం తప్పిందని, కానీ మరికొన్ని రోజులు అబ్జర్వేషన్‌లో ఉండాలని సూచించారు. ఈ ఘటనపై స్పందించిన జిల్లా అధికారులు … విద్యార్థుల క్రమశిక్షణ లోపానికి ఉపాధ్యాయులనే కారణంగా చూపుతూ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు మనోరంజన్ సాహును ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. అయితే, ఘటన సమయంలో ఆయన పాఠశాలలో లేరని తెలిసింది. హాస్టల్ వార్డెన్, సూపరింటెండెంట్‌ల వైఖరిపై విచారణ కొనసాగుతోంది. విద్యార్థుల వద్దకు ఫెవిక్విక్ ఎలా వచ్చిందనే కోణంలోనూ అధికారులు పరిశీలిస్తున్నారు.

మరిన్ని వీడియోల కోసం :

అద్భుత దృశ్యం.. ఆకాశానికి తాకుతున్న సముద్రం వీడియో

దసరా నవరాత్రులు ఈసారి 9 కాదు.. 10 రోజులు.. ఎందుకో తెలుసా?వీడియో

ఎంత గొప్ప మనస్సు..సొంత ఇంటిని పాఠశాలగా మార్చిన లారెన్స్‌ వీడియో

ఆపరేషన్‌ మధ్యలో వదిలేసి ఇదేం పాడుపని డాక్టరూ వీడియో