AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అల్లు అర్జున్‌ నా డ్రీమ్ హీరో అమ్మో..రితికాది పెద్ద ప్లానింగే వీడియో

అల్లు అర్జున్‌ నా డ్రీమ్ హీరో అమ్మో..రితికాది పెద్ద ప్లానింగే వీడియో

Samatha J
|

Updated on: Sep 15, 2025 | 3:17 PM

Share

మిరాయ్’ బ్లాక్‌బస్టర్ హిట్‌ని ఖాతాలో వేసుకున్న రితికా అందంతో పాటు అభినయంలో కూడా మంచి మార్కులే కొట్టేసింది. అసలు ‘అశోకవనంలో అర్జున కళ్యాణం’లో ఈమెను చూసి చాలామంది అచ్చ తెలుగు అమ్మాయేమో అనుకున్నారు. తన చిలిపితనం, అల్లరితో ఆ చిత్రంలో అంతలా ఆకట్టుకుంది. 'నాకు అల్లు అర్జున్‌ అంటే చాలా ఇష్టం. నేను ఆయన ఫ్యాన్‌ని. తనతో నటించాలని ఎంతో ఆశగా ఉంది. అది హీరోయిన్‌గా అయినా సరే.. చిన్న పాత్ర అయినా సరే.

‘ బన్నీతో స్క్రీన్ షేర్ చేసుకోవాలనేది నా కోరిక. అలాంటి అవకాశమొస్తే అస్సలు వదులుకోను’ అంటూ తన మనసులోని మాట బయటపెట్టేసింది ఈ బ్యూటీ. దీంతో అప్పుడే నెటిజన్లు బన్నీ, రితికా కాంబోని ఊహించేసుకుంటూ పోస్టులు పెట్టేస్తున్నారు. ‘మిరాయ్’ హిట్‌లో లక్కీ హీరోయిన్‌గా మారడంతో త్వరలోనే ఆమె కోరిక నెరవేరవచ్చని కొందరు అంటున్నారు. మొత్తంమీద ఈ బ్యూటీ పెద్ద ప్లానింగ్ మీదే ఉందని కామెంట్లు చేస్తున్నారు.రితికా ప్రస్తుతం రెండు చిత్రాల్లో నటిస్తోంది. వాటిలో తెలుగు – తమిళ బైలింగ్యువల్ మూవీ ఒకటి కాగా..వరుణ్ తేజ్ హీరోగా తెరకెక్కుతున్న VT15 ఉన్నాయి. ఈ రెండు ప్రాజెక్టులు షూటింగ్ దశలోనే ఉన్నాయి. తేజా సజ్జా హీరోగా నటించిన ఈ చిత్రం శుక్రవారం విడుదలై బ్లాక్‌బస్టర్ టాక్‌ సొంతం చేసుకోవడంతో హీరోయిన్ రితికా నాయక్ ట్రెండ్‌లోకి వచ్చింది. దీంతో ఆమె కోసం నెటిజన్లు సెర్స్ చేస్తున్నారు. ఫాంటసీ అడ్వంచర్‌గా తెరకెక్కిన ఈ చిత్రంలో కీలక పాత్రలో నటించడంతో ఆమెకు అవకాశాలు క్యూ కట్టడం ఖాయమని పలువురు అభిప్రాయపడుతున్నారు. అయితే ఇందులో హీరోతో రొమాన్స్ చేయడానికి వీల్లేకుండా పోయింది.

మరిన్ని వీడియోల కోసం :

అద్భుత దృశ్యం.. ఆకాశానికి తాకుతున్న సముద్రం వీడియో

దసరా నవరాత్రులు ఈసారి 9 కాదు.. 10 రోజులు.. ఎందుకో తెలుసా?వీడియో

ఎంత గొప్ప మనస్సు..సొంత ఇంటిని పాఠశాలగా మార్చిన లారెన్స్‌ వీడియో

ఆపరేషన్‌ మధ్యలో వదిలేసి ఇదేం పాడుపని డాక్టరూ వీడియో