Watch Video: వడగండ్ల వానలు సృష్టించిన బీభత్సం.. పిడుగుపాటుకు ఇద్దరు రైతులు బలి..

| Edited By: Srikar T

May 06, 2024 | 9:28 AM

భానుడి భగభగలతో ఉక్కిరిబిక్కిరవుతున్న జనం.. చల్ల బడ్డ వాతావరణంతో కాస్త ఊపిరి పీల్చుకున్నారు. కానీ వడగండ్లవానలు, పిడుగులు ఊహించని నష్టాన్ని మిగిల్చాయి. వరంగల్ ఉమ్మడి జిల్లాలో ఒకేరోజు ఇద్దరు రైతులు పిడుగుపాటుకు గురై ప్రాణాలు కోల్పోయారు. నిన్న రాత్రి కురిసిన వడగండ్ల వాన ఊహించని నష్టాన్ని మిగిల్చింది. మిర్చి, వరి, బొప్పాయి పంటలకు తీవ్రనష్టం వాటిల్లింది. చేతికి అందిన పంట నీటి పాలైందని రైతులు రోధిస్తున్నారు. పంటలను కాపాడుకునే ప్రయత్నాల్లో వేరువేరు ప్రాంతాల్లో పిడుగుపాటుకు గురై ఇద్దరు రైతులు మృతి చెందారు.

భానుడి భగభగలతో ఉక్కిరిబిక్కిరవుతున్న జనం.. చల్ల బడ్డ వాతావరణంతో కాస్త ఊపిరి పీల్చుకున్నారు. కానీ వడగండ్లవానలు, పిడుగులు ఊహించని నష్టాన్ని మిగిల్చాయి. వరంగల్ ఉమ్మడి జిల్లాలో ఒకేరోజు ఇద్దరు రైతులు పిడుగుపాటుకు గురై ప్రాణాలు కోల్పోయారు. నిన్న రాత్రి కురిసిన వడగండ్ల వాన ఊహించని నష్టాన్ని మిగిల్చింది. మిర్చి, వరి, బొప్పాయి పంటలకు తీవ్రనష్టం వాటిల్లింది. చేతికి అందిన పంట నీటి పాలైందని రైతులు రోధిస్తున్నారు. పంటలను కాపాడుకునే ప్రయత్నాల్లో వేరువేరు ప్రాంతాల్లో పిడుగుపాటుకు గురై ఇద్దరు రైతులు మృతి చెందారు. ములుగు జిల్లా ఏటూరు నాగారంలో బుల్లయ్య అనే రైతు పిడుగుపాటుకు మృతి చెందాడు. కలాల్లో ఆరబోసిన మిర్చి తడిసి పోకుండా కాపాడుకోవడం కోసం పాల్తిన్ కవర్ కప్పుతుండగా పిడుగుపడి అక్కడిక్కడే మృతి చెందాడు మరో రైతు. రఘునాథపల్లి మండలం కోడూరు గ్రామంలో దాసరి అజయ్(25) అనే రైతు తన వ్యవసాయ క్షేత్రంలో పిడుగు పడి మృతి చెందాడు. రైతుతో సహా ఆవు, లేగదూడపై కూడా పిడుగు పడింది. వాజేడు మండలం బొల్లారంలో గుడిసెపై పిడుగుపడి నెలమ్మట్టమైంది. ఆ గుడిసెలో నివశిస్తున్న కుటుంబం తీవ్ర గాయాలతో బయటపడ్డారు. వారిని వెంకటాపురం ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

Follow us on