Hyderabad: కారులో పెట్రోల్ కొట్టిద్దామని బంక్‌కు.. కట్ చేస్తే.. తెల్లారి స్టార్ట్ చేయగా

Updated on: Sep 12, 2025 | 5:24 PM

పెట్రోల్ బంకు‌కు వెళ్లి కారులో పెట్రోల్ కొట్టిస్తున్నారా.? అయితే తస్మాత్ జాగ్రత్త.. ఈ వీడియో చూస్తే మీరు షాక్ అవ్వడం ఖాయం. ఇది హైదరాబాద్‌లో చోటు చేసుకుంది. ఆ వివరాలు ఏంటో ఈ స్టోరీలో చూసేద్దాం.. ఓ సారి లుక్కేయండి మరి.

రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం‌లో కల్తీ పెట్రోల్ కలకలం రేపింది. స్థానికంగా ఉన్న పెట్రోల్ బంకు‌లో బాధితుడు పెట్రోల్ కొట్టించుకోగా.. నీళ్లు వచ్చాయని ఆందోళన వ్యక్తం చేశాడు. బంకు అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని బాధితుడు చెప్పుకొచ్చాడు. వివరాల్లోకి వెళ్తే.. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మున్సిపల్ పరిధిలోని శేరిగూడ సమీపంలో ఉన్న పవన్ పెట్రోల్ బంక్‌లో గురువారం రాత్రి బ్రీజా కారులో మహేష్ అనే వ్యక్తి పెట్రోల్ కొట్టించుకున్నాడు. ఇక నెక్స్ట్ డే కారు స్టార్ట్ కాకపోవడంతో మెకానిక్ దగ్గరకు తీసుకెళ్లాడు. పెట్రోల్ ట్యాంక్‌లో నీరు చేరడంతో కారు ఇంజిన్ చెడిపోయిందని అతడు చెప్పినట్టుగా మహేష్ అన్నాడు. సదరు బాధితుడు శేరిగూడ పెట్రోల్ పంపు సిబ్బందితో ఈ విషయంపై గొడవకు దిగాడు. లైవ్‌లో వాటర్ బాటిల్‌లో పెట్రోల్ కొట్టించి బాధితులు నీరును చూపించాడు. గతంలో అనేకసార్లు ఈ పెట్రోల్ పంపుపై ఆరోపణలు వచ్చాయని.. కేంద్ర పెట్రోలియం శాఖ, జిల్లా కలెక్టర్‌కు, డీఎస్ఓకు గతంలో బాధితులు ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోలేదని గగ్గోలు పెట్టారు.