Drinking Water: నీళ్లు నిలబడి తాగుతున్నారా.. వెరీ డేంజర్‌ సుమా..!

మన పెద్దలు ఆచారాల పేరుతో ఎన్నో ఆరోగ్యకరమైన విషయాలను అందించారు. భోజనం చేసే విధానం నుంచి నిద్రపోయే వరకూ ఎన్నో పద్ధతులు మన కోసం చెప్పారు. వాటి వెనుక ఎంతో సైన్స్‌ దాగిఉంది. ముఖ్యంగా మన ఆరోగ్యం. సాధారణంగా మనం మంచినీళ్లు ఎలాపడితే అలా తాగేస్తుంటాం. మంచి నీటిని 90 శాతం మంది తప్పుగానే తాగుతుంటారు. ఈ విధంగా తాగడం వల్ల అనారోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు.

Drinking Water: నీళ్లు నిలబడి తాగుతున్నారా.. వెరీ డేంజర్‌ సుమా..!

|

Updated on: Mar 22, 2024 | 1:14 PM

మన పెద్దలు ఆచారాల పేరుతో ఎన్నో ఆరోగ్యకరమైన విషయాలను అందించారు. భోజనం చేసే విధానం నుంచి నిద్రపోయే వరకూ ఎన్నో పద్ధతులు మన కోసం చెప్పారు. వాటి వెనుక ఎంతో సైన్స్‌ దాగిఉంది. ముఖ్యంగా మన ఆరోగ్యం. సాధారణంగా మనం మంచినీళ్లు ఎలాపడితే అలా తాగేస్తుంటాం. మంచి నీటిని 90 శాతం మంది తప్పుగానే తాగుతుంటారు. ఈ విధంగా తాగడం వల్ల అనారోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. నీటిని తాగేందుకు కూడా ఒక పద్ధతి ఉంటుందని వారు సూచిస్తున్నారు. ఆయుర్వేద ప్రకారం నీటిని భోజనానికి 30 నిమిషాల ముందు, భోజనం తర్వాత 30 నిమిషాలు ఆగి తాగాలి. అప్పుడే మనం తిన్న ఆహారంలో ఉండే పోషకాలను శరీరం సరిగ్గా గ్రహిస్తుంది. తిన్న ఆహారం సక్రమంగా జీర్ణమవుతుంది. కనుక భోజనం చేసేటప్పుడు ఎట్టి పరిస్థితిలోనూ నీళ్లను తాగరాదు. అంతగా తాగాలనిపిస్తే ఒకసారి చప్పరించవచ్చు అంటున్నారు. మరో ముఖ్య విషయం ఏంటంటే నీళ్లను ఎల్లప్పుడూ కూర్చునే తాగాలి. నిలుచుని తాగకూడదు. నిలుచుని తాగడంవలన జీర్ణవ్యవస్థపై నేరుగా ప్రభావాన్ని చూపిస్తుంది. అది కిడ్నీల పనితీరును నెమ్మదింపజేస్తుంది. కనుక నీళ్లను ఎల్లప్పుడూ కూర్చునే తాగాలి. ఎల్లప్పుడూ గోరు వెచ్చని నీళ్లు లేదా గది ఉష్ణోగ్రత వద్ద ఉండే నీళ్లను తాగాలి. చల్లని నీళ్లను తాగకూడదు. అయితే కుండలోని నీళ్లను తాగవచ్చంటున్నారు. ఫ్రిజ్‌లో చల్ల బరిచిన నీళ్లను అస్సలు తాగకూడదట. అలా తాగితే శరీరంలో కఫం పెరిగిపోయి, శ్వాసకోశ సమస్యలు వస్తాయి. ఆహారం సరిగ్గా జీర్ణం కాక మలబద్దకం సమస్య వస్తుంది. మనం తినే ఆహారంలో ఉండే పోషకాలను కూడా శరీరం సరిగ్గా శోషించుకోలేదంటున్నారు.

అంతేకాదు చల్లని నీళ్లను తాగడం వల్ల రక్త నాళాలు కుచించుకుపోతాయి. దీంతో గుండె జబ్బులు, హార్ట్‌ ఎటాక్‌ వచ్చే అవకాశాలు పెరుగుతాయి. కనుక చల్లని నీళ్లను తాగకపోవడమే మంచిది. అలాగే ఒకేసారి పెద్ద మొత్తంలో కూడా నీళ్లను తాగొద్దంటున్నారు. బాగా దాహంగా ఉందని ఆబగా తాగేయ్యకూడదు. నీళ్లను తాగేటప్పుడూ మధ్య మధ్య కొంత సమయం గ్యాప్‌ ఇచ్చి తాగాలి. ఇలా ఎక్కువ మొత్తంలో నీళ్లను ఒకేసారి తాగడం వల్ల జీర్ణాశయంపై ఒత్తిడి పెరుగుతుంది. ఇది మంచిది కాదు. కనుక నీళ్లను కొద్దిగా కొద్దిగా ఎక్కువ సార్లు తాగాలి. నీళ్లను తగినంత మోతాదులో తాగకపోతే మూత్రం పసుపు రంగులో వస్తుంది. అంటే మీరు నీళ్లను సరిగ్గా తాగడం లేదని అర్థం. రోజుకు కనీసం రెండు నుంచి మూడు లీటర్ల నీళ్లను తాగాలి. అలాగే దాహం వేసినప్పుడు మాత్రమే నీళ్లను తాగాలి. అవసరం ఉన్నా, లేకపోయినా పదే పదే నీళ్లను తాగకూడదు. నీళ్లను అవసరం లేకపోయినా ఎక్కువగా తాగితే కిడ్నీలు ఎక్కువగా పనిచేయాల్సి వస్తుంది. దీంతో కిడ్నీల వ్యాధులు వచ్చేందుకు అవకాశం ఉంటుంది. కిడ్నీలు చెడిపోయే ప్రమాదం కూడా ఉంటుంది. కనుక అవసరం ఉన్నంత మేరకే నీళ్లను తాగితే బెటర్‌. ఇక ఉదయం నిద్ర లేచిన వెంటనే ఒక గ్లాస్‌ గోరు వెచ్చని నీళ్లను తాగితే మలబద్దకం సమస్య ఉండదు. అధిక బరువు తగ్గుతుంది. గ్యాస్‌ సమస్య నుంచి బయట పడవచ్చు. గోరు వెచ్చని నీళ్లను ఒక లీటర్‌ వరకు కూడా ఉదయం తాగవచ్చు. కానీ కొంత సమయం ఇచ్చి తాగాలి. అప్పుడే ప్రయోజనం ఉంటుంది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

రాధమ్మ మదిలో కృష్ణయ్య.. చూడముచ్చటైన జంట గా తారక రామ , ప్రణతి.

ఆ విషయంలో ఇప్పటికీ వరుణ్ తేజ్ పై కోపమే ఉంది.! చిరు కామెంట్స్.

‘నా భర్త VDలా ఉండాలి.!’ నో కన్ఫూజన్‌ తెలిసిన కాంబినేషనేగా..

Follow us
పర్వతం కనిపించకుండా భారీగా నల్లటి తెర !! ఎందుకంటే ??
పర్వతం కనిపించకుండా భారీగా నల్లటి తెర !! ఎందుకంటే ??
విజయ్ మాల్యా విషయంలో ఫ్రాన్స్ సాయం కోరిన భారత్
విజయ్ మాల్యా విషయంలో ఫ్రాన్స్ సాయం కోరిన భారత్
పురుగులు పట్టిన బియ్యం తినొచ్చా ?? తింటె ఏమౌతుంది ??
పురుగులు పట్టిన బియ్యం తినొచ్చా ?? తింటె ఏమౌతుంది ??
తులసితో తళతళలాడే అందం..! మొటిమలు, మచ్చలు మాయం చేసే అద్భుత మంత్రం
తులసితో తళతళలాడే అందం..! మొటిమలు, మచ్చలు మాయం చేసే అద్భుత మంత్రం
పులివెందులలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన వైఎస్ భారతి.. ఏమన్నారంటే
పులివెందులలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన వైఎస్ భారతి.. ఏమన్నారంటే
యాంకర్ లాస్య ఇంట తీవ్ర విషాదం.. 'మీ ఆత్మ ఎప్పటికీ మాతోనే' అంటూ..
యాంకర్ లాస్య ఇంట తీవ్ర విషాదం.. 'మీ ఆత్మ ఎప్పటికీ మాతోనే' అంటూ..
ఆంధ్రాలో పింఛన్ తీసుకునేవారికి శుభవార్త..
ఆంధ్రాలో పింఛన్ తీసుకునేవారికి శుభవార్త..
స్పాట్ లెస్ బ్యూటి కోసం నారింజ తొక్కలతో ఫేస్ మాస్క్‌..!ఇలా వాడితే
స్పాట్ లెస్ బ్యూటి కోసం నారింజ తొక్కలతో ఫేస్ మాస్క్‌..!ఇలా వాడితే
సరసమైన ధరలోనే హైబ్రీడ్ కారు.. మారుతి సుజుకీ నుంచి..
సరసమైన ధరలోనే హైబ్రీడ్ కారు.. మారుతి సుజుకీ నుంచి..
దంచికొట్టిన సాయి సుదర్శన్, షారుఖ్.. ఆర్సీబీ ముందు భారీ టార్గెట్
దంచికొట్టిన సాయి సుదర్శన్, షారుఖ్.. ఆర్సీబీ ముందు భారీ టార్గెట్