Jr NTR: దండోరా మూవీపై ఎన్టీఆర్ రివ్యూ

Updated on: Jan 21, 2026 | 7:28 PM

బిజీగా ఉండే యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇటీవల 'దండోరా' చిత్రాన్ని అమెజాన్ ప్రైమ్‌లో చూశారు. మురళీ కాంత్ దర్శకత్వంలో శివాజీ, నవదీప్, నందు నటించిన ఈ సినిమా తనను చాలా ఆలోచింపజేసిందని ప్రశంసించారు. అద్భుతమైన కథ, నటనకు చిత్రబృందాన్ని కొనియాడారు. ఎన్టీఆర్ పోస్ట్‌పై హీరో నవదీప్ 'థ్యాంక్ యూ అన్నయ్య' అంటూ స్పందించారు, ఇది నెట్టింట వైరల్ అవుతోంది.

తన సినిమాలతో.. తన వ్యాపకాలతో ఎప్పుడూ బిజీగా ఉండే యంగ్ టైగర్ ఎన్టీఆర్.. వీలైనప్పుడల్లా.. కొత్త సినిమాలను చూస్తుంటారు. నచ్చిన సినిమా గురించి తన సోషల్ మీడియాలో పంచుకుంటూ ఉంటారు. సినిమా మేకర్స్‌ను.. టీంను అప్రిషియేట్ చేస్తూ పోస్టు పెడుతుంటాడు. మంచి సినిమాను తన వంతుగా మరింతగా జనాల్లోకి తీసుకెళుతుంటాడు. తారక్ ఇప్పుడు కూడా ఇదే చేశాడు. దండోరా మూవీని మెచ్చుకుంటూ పోస్టు పెట్టాడు. మురళీ కాంత్ డైరెక్షన్లో శివాజీ, నవదీప్, నందు లీడ్‌ రోల్లో తెరకెక్కిన మూవీ దండోరా. 2025 డిసెంబర్ 25న రిలీజ్ అయిన ఈమూవీ మంచి టాక్ తెచ్చుకుంది. కొన్ని రోజుల ముందు నుంచి అమేజాన్ ప్రైమ్‌ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈక్రమంలోనే ఈ మూని చూసిన ఎన్టీఆర్.. దండోరా సినిమాపై ప్రశంసలు కురిపించారు. ఈ సినిమాను అద్భుతంగా తెరకెక్కించారని అన్నారు. ఇప్పుడే.. దండోరా సినిమా చూశానని చెప్పిన ఎన్టీఆర్.. ఈ సినిమా తనని చాలా ఆలోచించేలా చేసిందంటూ కొనియాడారు. శివాజీ, నవదీప్‌, నందు, రవికృష్ణ, బిందు మాధవి అద్భుతంగా నటించారని ఎన్టీఆర్‌ ప్రశంసించారు. ఇంత బలమైన కథను అద్భుతంగా తెరకెక్కించిన దర్శకుడు మురళీ కాంత్‌కు తన ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. ఈ ప్రయత్నానికి మద్దతు ఇచ్చినందుకు రవీంద్ర బెనర్జీకి అభినందనలు అంటూ తన పోస్ట్‌ లో కోట్ చేశారు తారక్. అయితే ఎన్టీఆర్ పోస్ట్‌ కాస్తా నెట్టింట వైరల్‌ కావడంతో.. హీరో నవదీప్ రిప్లై ఇచ్చాడు. థ్యాంక్ యూ అన్నయ్య అంటూ పోస్ట్ చేశాడు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Akshay Kumar: ప్రమాదం నుంచి తప్పించుకోవడమే కాదు క్షతగాత్రులకు సాయం చేసిన స్టార్ హీరో

Chiranjeevi: ‘మీరు లేనిదే.. నేను లేను’ మెగాస్టార్ ఎమోషనల్

Naveen Polishetty: రూ.100 కోట్ల ఆనందంలో.. నవీన్ భావోద్వేగం

Chiranjeevi: బాక్సాఫీస్‌ కలెక్షన్స్‌లో.. మెగాస్టార్ ఆల్ టైం రికార్డ్‌

ఏపీ రైతులకు గుడ్ న్యూస్.. ధాన్యం అమ్మినరోజే నగదు